Lighting strikes: పిడుగుల వర్షం..24 గంటల్లో 8 మంది మృతి
ABN, Publish Date - Jul 06 , 2024 | 02:51 PM
ఓవైపు వరుస వంతెనలు కుప్పకూలుండటం బీహార్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుండగా మరోవైపు గత 24 గంటల్లో పిడుగుపాటుకు 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఆరు జిల్లాల్లో ఈ పిడుగుల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.
పాట్నా: ఓవైపు వరుస వంతెనలు కుప్పకూలుండటం బీహార్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుండగా మరోవైపు గత 24 గంటల్లో పిడుగుపాటుకు (Lighting strikes) 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఆరు జిల్లాల్లో ఈ పిడుగుల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. జెహ్నాబాద్, మాథేపుర, ఈస్ట్ చంపరాన్, రోహ్టాస్, శరణ్, సుపౌల్ జిల్లాల్లో పిడుగుల బీభత్సం సంభవించినట్టు చెప్పారు.
రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
పలు జిల్లాల్లో 8 మంది వరకు పిడుగుపాటుకు మృతి చెందడటంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. జహ్నాబాద్‌లో ముగ్గురు, మాధేపురలో ఇద్దరు, ఈస్ట్ చంపరాన్, రోహ్టాస్, శరణ్, సుపౌల్‌లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడినట్టు సీఎంఓ కార్యాలయం శనివారంనాడు తెలిపింది. డిజాస్టర్ మేనేజిమెంట్ డిపార్ట్‌మెంట్ సూచనలను పాటించాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు.
NEET UG: నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా.. కారణం అదే
కుప్పకూలిన 9 బ్రిడ్జిలు, 17 మంది సస్పెండ్
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇటీవల ఒకదాని వెంట మరొకటి చొప్పున తొమ్మిది వంతెనలు కుప్పకూలగా, వాటిలో 6 పాత వంతెనలు, 3 నిర్మాణంలో ఉన్న వంతెనలు ఉన్నాయి. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. జలవనరుల శాఖకు చెందిన 11 మందితో సహా 17 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. వారి నుంచి సొమ్ము రికవరీ ప్రయత్నాలు చేపట్టింది. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను నిలిపివేసింది.
For Latest News and National News click here
Updated Date - Jul 06 , 2024 | 02:55 PM