ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fake Doctor: వీడు మనిషేనా.. యూట్యూబ్‌లో చూస్తూ బాలుడికి ఆపరేషన్.. చివరికి

ABN, Publish Date - Sep 08 , 2024 | 01:40 PM

సమాజంలో నకిలీ వైద్యుల బెడద ఎక్కువైపోతోంది. తమకు వచ్చిరాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలు హరించివేస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా బిహార్‌లో ఇలాంటి ఘటనే జరిగింది.

రాంచీ: సమాజంలో నకిలీ వైద్యుల బెడద ఎక్కువైపోతోంది. తమకు వచ్చిరాని వైద్యంతో నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. తాజాగా బిహార్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. నకిలీ వైద్యుడు యూట్యూబ్ చూస్తూ బాలుడికి ఆపరేషన్ చేశాడు.ఈ ఘటనలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరన్ జిల్లాలో ఓ బాలుడు తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. ఇటీవల అతను అనారోగ్యానికి గురయ్యాడు.

కొన్నిసార్లు వాంతులు చేసుకున్నాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుడు చికిత్స చేసిన అనంతరం వాంతులు తగ్గిపోయాయి. అయితే అక్కడే పని చేస్తున్న ఫేక్ డాక్టర్ బాలుడి శరీరంలో రాళ్లున్నాయని వాటిని తొలగించాలని తల్లిదండ్రులకు చెప్పాడు.


అతని మాటలు నమ్మిన పేరెంట్స్ ఆపరేషన్‌కి అంగీకరించారు. అనంతరం యూట్యూబ్లో వీడియోలు చూస్తూ బాలుడికి ఆపరేషన్ చేశాడు. ఇది జరుగుతున్న క్రమంలోనే బాలుడి పరిస్థితి విషమించింది. కంగారు పడిన డాక్టర్ మెరుగైన చికిత్స కోసం అతడిని వేరే ఆసుపత్రికి రిఫర్ చేశాడు. బాలుడిని అంబులెన్స్‌లో అక్కడికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి నకిలీ డాక్టర్ సహా సిబ్బంది పరారయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలిస్తున్నారు.


కఠిన చర్యలు తీసుకోవాలి..

“మా మనుమడికి వాంతులు కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. కుదుటపడిన తర్వాత ఇంటికి తీసుకెళ్తుండగా.. ఫేక్ డాక్టర్ ఆపరేషన్ చేయాలని పట్టుబట్టాడు. యూట్యూబ్ చూస్తూ సర్జరీ చేయడాన్ని మేం కళ్లారా చూశాం. అతడి విద్యార్హతలు తెలుసుకోకుండా మా అబ్బాయిని ఆస్పత్రిలో చేర్పించాం. ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్‌గాళ్లని కఠినంగా శిక్షించాలి. మా కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి" అంటూ బాలుడి తాత డిమాండ్ చేశారు.

Updated Date - Sep 08 , 2024 | 01:45 PM

Advertising
Advertising