ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mamata Mohanta: బీజేడీకి షాక్.. రాజ్యసభ సభ్యురాలు మమత మోహంత రాజీనామా

ABN, Publish Date - Jul 31 , 2024 | 08:34 PM

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల అధికారం కోల్పోయిన బిజూ జనతాదళ్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత మమత మోహంతా తన రాజ్యసభ సభ్యత్వానికి బుధవారంనాడు రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖఢ్ ఆమోదించారు.

న్యూఢిల్లీ: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల అధికారం కోల్పోయిన బిజూ జనతాదళ్‌ (Biju Janata Dal)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత మమత మోహంతా (Mamata Mohanta) తన రాజ్యసభ సభ్యత్వానికి బుధవారంనాడు రాజీనామా (resign) చేశారు. ఆమె రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖఢ్ ఆమోదించారు. ఒడిశా రాష్ట్ర నుంచి బీజేడీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మమత మోహంతా నేరుగా తనకు రాజీనామా పత్రాన్ని అందించారని, సరైన ఫార్మెట్‌లో ఆమె రాజీనామా పత్రం ఉండటంతో ఆమోదించామని, తక్షణం ఇది అమల్లోకి వచ్చిందని ధన్‌ఖడ్ తెలిపారు.


బీజేపీలో చేరే అవకాశం

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మమత మోహంతా బీజేపీలో చేరే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఒడిశా అసెంబ్లీలో బీజేపీకి మెజారిటీ ఉన్నందున ఆమె రాజీనామాతో ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా బీజేపీ నిలబెట్టే అభ్యర్థి సునాయాసంగా గెలుస్తారు.

HD Kumaraswamy: బీజేపీతో వేదిక పంచుకోం... హెచ్‌డీ కుమారస్వామి సీరియస్


రాజీనామా లేఖలో ఏమి చెప్పారంటే..?

మమతా మోహంతా 'ఐచ్ఛికంగా' తన పదవికి రాజీనామా చేసినట్టు జగ్దీప్ ధన్‌ఖఢ్‌కు అందించిన లేఖలో పేర్కొన్నారు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు అవకాశం ఇచ్చిన ధన్‌ఖఢ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సామాజిక మాధ్యమంలో 'ఎక్స్'లో కూడా తన రాజీనామా విషయాన్ని ఆమె తెలియజేశారు. బీజేడీ అధ్యక్షుడు తనకు జిల్లా కౌన్సిల్ సభ్యురాలిగా, రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించి సొంత జిల్లాకు సేవ చేసుకునే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. నవీన్ పట్నాయక్‌కు రాసిన రాజీనామా లేఖలోనూ బీజేడీ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేసినట్టు మమత మోహంతా తెలిపారు. మయూర్‌భంజ్ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు ఒడిశా సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించే అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సొంత కమ్యూనిటీతో పాటు బిజూ జనతా దళ్‌లో ఇక తన సేవలు అవసరం లేదని భావిస్తున్నానని, ప్రజాప్రయోజనాల రీత్యా రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 08:38 PM

Advertising
Advertising
<