ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP Poll List: 5వ జాబితా ప్రకటించిన బీజేపీ.. కంగనా రనౌత్ ఎక్కడి నుంచంటే?

ABN, Publish Date - Mar 24 , 2024 | 09:59 PM

కేంద్రంలోని అధికార బీజేపీ 5వ విడత అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థులతో జాబితాను వెల్లడించింది. పార్టీలో కొత్తగా చేరిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, రంజిత్ చౌతాలాకు సీట్లు దక్కాయి. వారితో పాటు కోల్‌కత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ, నటి కంగనా రనౌత్‌లకు బీజేపీ సీట్లు ఇచ్చింది. వరుణ్‌గాంధీ తల్లి మేనకా గాంధీని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది.

న్యూఢిల్లీ: కేంద్రంలోని అధికార బీజేపీ 5వ విడత అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థులతో జాబితాను వెల్లడించింది. పార్టీలో కొత్తగా చేరిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, రంజిత్ చౌతాలాకు సీట్లు దక్కాయి. వారితో పాటు కోల్‌కత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ, నటి కంగనా రనౌత్‌లకు బీజేపీ సీట్లు ఇచ్చింది. వరుణ్‌గాంధీ తల్లి మేనకా గాంధీని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. అయితే వరుణ్ గాంధీని పార్టీ పక్కనబెట్టింది. వరుణ్ గాంధీ ఎంపీగా ఉన్న పిలిభిత్ స్థానాన్ని ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చిన జితిన్ ప్రసాద్‌కు కేటాయించింది.

ఇక కేరళలోని వాయనాడ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీపై సీనియర్ నేత కే.సురేంద్రన్‌ను బీజేపీ బరిలోకి దించింది. నటి కంగనా రనౌత్‌కు సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఇటీవలే బీజేపీలో చేరిన కోల్‌కత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యకు బెంగాల్‌లోని తామ్‌లుక్ సీటు కేటాయించింది. ఇక ఒడిశాలో బీజూ జనతాదళ్‌ పార్టీతో పొత్తు ఉండడంతో సంభల్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పూరీ నుంచి సంబిత్ పాత్రలను పోటీకి నిలబెట్టింది.

Updated Date - Mar 24 , 2024 | 10:01 PM

Advertising
Advertising