Lok Sabha Polls: బీజేపీ 7వ జాబితాలో నవనీత్ రాణాకు చోటు
ABN, Publish Date - Mar 27 , 2024 | 07:57 PM
లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల 7వ జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారంనాడు విడుదల చేసింది. ఈ జాబితాలో నటి, రాజకీయ నాయకురాలు నవనీత్ రాణాకు చోటు దక్కింది. మహారాష్ట్రలోని అమరావతి నుంచి రాణా తిరిగి పోటీ చేయనున్నారు. ఆమె 2019లో ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా అమరావతి నుంచి పోటీ చేసి గెలుపొందారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections) పోటీచేసే అభ్యర్థుల 7వ జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారంనాడు విడుదల చేసింది. ఈ జాబితాలో నటి, రాజకీయ నాయకురాలు నవనీత్ రాణా (Navneet )కు చోటు దక్కింది. మహారాష్ట్రలోని అమరావతి (Amravati) నుంచి రాణా తిరిగి పోటీ చేయనున్నారు. ఆమె 2019లో ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా అమరావతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి ఇదే నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ టిక్కెట్ లభించింది. కాగా, చిత్రదుర్గ్ నుంచి గోవింద్ కర్జోల్‌ను తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, హర్యానా ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. హర్యానా ముఖ్యమంత్రి నయబ్ సింగ్.. కర్నాల్ నుంచి పోటీ చేయనున్నారు. మనోహర్ లాల్ ఖట్టార్ ఇటీవల రాజీనామా చేయడంతో కర్నాల్ నియోజకవర్గానికి నయబ్ సింగ్‌ను బీజేపీ నిలబెట్టింది. కాగా, చిత్రదుర్గ నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి ఎ.నారాయణ స్వామి స్థానంలో గోవింద్ కర్జోల్‌కు టిక్కెట్ ఇచ్చింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 27 , 2024 | 07:57 PM