మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Farooq Abdullah: 'ఇండియా' కూటమి అభ్యర్థులతో బీజేపీ గుండెల్లో రైళ్లు

ABN, Publish Date - Apr 13 , 2024 | 06:53 PM

'ఇండియా' కూటమిని, కూటమి అభ్యర్థులను చూసి బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్రిని ప్రధానమంత్రి ఇప్పుడెందుకు ఇవ్వలేదని నిలదీశారు.

Farooq Abdullah: 'ఇండియా' కూటమి అభ్యర్థులతో బీజేపీ గుండెల్లో రైళ్లు

శ్రీనగర్: 'ఇండియా' (INDIA) కూటమిని, కూటమి అభ్యర్థులను చూసి బీజేపీ (BJP) గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) నేత ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) అన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్రిని ప్రధానమంత్రి ఇప్పుడెందుకు ఇవ్వలేదని నిలదీశారు.


''ఇండియా కూటమి ఇక్కడి 6 సీట్లూ గెలుచుకుంటుంది. కుటుంబపాలన ఏముంది? మేము ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్టీలో వారసత్వపాలన లేదా? నేషనల్ కాన్ఫెరెన్స్, కాంగ్రెస్ పార్టీల్లోనే ఉన్నాయా? ఒక పారిశ్రామికవేత్త తన పిల్లలను పారిశ్రామికవేత్తలను చేయాలనుకుంటాడు. వాళ్లేమైనా ఓట్లు తీసుకుంటారా? కానీ మేము ఓట్లు అడుగుతాం. ప్రజల ముందుకు వెళ్తాం. వారికోసం పని చేస్తాం. నచ్చకపోతే ప్రజలే మమ్మల్ని తిరస్కరిస్తారు'' అని ఫరూక్ అబ్దుల్లా శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

Video Viral: అధీర్ రంజన్ వీరంగంపై టీఎంసీ సంచలన వీడియో


ఇండియా కూటమిని చూసి, కూటమి అభ్యర్థులను చూసి బీజేపీకి భయం పట్టుకుందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ''వాళ్లకు ఏమి చేయాలో తెలియదు. తెలిసిందల్లా తప్పుడు ప్రచారం చేయడమే. ప్రధానమంత్రి ఇప్పుడెందుకు జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్రి కల్పించలేదు? దేనికోసం వేచిచూస్తున్నారు? ఉదంపూర్ వచ్చారు. అప్పుడు ఎందుకు ప్రకటన చేయలేదు'' అని ప్రశ్నించారు.


ప్రధానమంత్రి ఇటీవల ఉదంపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా లభిస్తుందని అన్నారు. ప్రజలు తమ కలలను ఎమ్మెల్యేలు, మంత్రులతో పంచుకోవచ్చన్నారు. దశాబ్దాల తర్వాత ఉగ్రవాద భయాలు, సరిహద్దు కాల్పులకు తావులేని వాతావరణంలో త్వరలో ఎన్నికలు జరుగుతాయని భరోసా ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 13 , 2024 | 06:53 PM

Advertising
Advertising