Gujarat: ఆత్మగౌరవమే ముఖ్యం.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా
ABN, Publish Date - Mar 19 , 2024 | 02:07 PM
లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్ బీజేపీ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వడోదర జిల్లా సావ్లి బీజేపీ ఎమ్మెల్యే కేతన్ ఇనామ్‌దార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో సీనియర్ అధికారులు తనను పట్టించుకోవడం లేదని, పదవి కంటే ఆత్మగౌరవే ముఖ్యమని అందుకే రాజీనామా చేసినట్లు చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్ బీజేపీ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వడోదర జిల్లా సావ్లి బీజేపీ ఎమ్మెల్యే కేతన్ ఇనామ్‌దార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో సీనియర్ అధికారులు తనను పట్టించుకోవడం లేదని, పదవి కంటే ఆత్మగౌరవే ముఖ్యమని అందుకే రాజీనామా చేసినట్లు చెప్పారు. తన రాజీనామా లేఖను స్పీకర్ శంకర్ చౌదరికి సమర్పించారు. ఎవరినో ఒత్తిడికి గురిచేయాలనే లక్ష్యం తనది కాదని, పార్లమెంట్ ఎన్నికల్లో వడోదర స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్ భట్ విజయం కోసం పని చేస్తానని కేతన్ ఇనామ్‌దార్ తెలిపారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా..
కేతన్ ఇనామ్‌దార్ వడోదర జిల్లాలోని సావ్లి స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2020లో ఒకసారి ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. ఆత్మగౌరవం కోసమే పదవిని వదులుకుంటున్నట్లు చెప్పారు. 11 సంవత్సరాలకు పైగా తాను సావ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, బీజేపీతో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉందన్నారు. అధికారుల తీరుపై తాను అసంతృప్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. 2012 తొలిసారి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇనామ్‌దార్ గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 2017, 2022 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 19 , 2024 | 02:07 PM