Maharashtra: బీజేపీ ఎమ్మెల్యేలు నితేష్ రాణా, రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్
ABN, Publish Date - Jan 07 , 2024 | 07:51 PM
షోలాపూర్ లో జరిగిన హిందూ జన్ ఆక్రోష్ ర్యాలీలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే, పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు జైల్ రోడ్ స్టేషన్ అధికారులు తెలిపారు. రాజేంద్ర చౌక్, కన్నా చౌక్ మధ్య శనివారంనాడు హిందూ జన్ ఆక్రోష్ ర్యాలీ నిర్వహించారు.
ముంబై: షోలాపూర్ (Sholapur)లో జరిగిన 'హిందూ జన్ ఆక్రోష్' ర్యాలీలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే (Nitesh Rana), పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు జైల్ రోడ్ స్టేషన్ అధికారులు తెలిపారు. రాజేంద్ర చౌక్, కన్నా చౌక్ మధ్య శనివారంనాడు హిందూ జన్ ఆక్రోష్ ర్యాలీ నిర్వహించారు. సకల్ హిందూ సమాజ్ నేతలు, ఆఫీసు బేరర్లు సైతం ఇందులో పాల్గొన్నారు.
రాణే తన ప్రసంగంలో 'జీహాదీలు', 'మసీదుల కూల్చివేత' ప్రస్తావనలు చేయగా, హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన తన ప్రసంగంలో "లవ్ జీహాద్''పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు అధికారులు తెలిపారు. ఐపీసీలోని సెక్షన్ 153ఏ, 295ఏ కింద ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు, సకల్ హిందూ సమాజ్ ఆఫీస్ బేరర్ సుధాకర్ మహదేవ్ బహిర్‌వాడే, మరో 8 నుంచి 10 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు.
Updated Date - Jan 07 , 2024 | 07:51 PM