ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆ చిల్లర నేతల వ్యాఖ్యలు పట్టించుకోను

ABN, Publish Date - Feb 11 , 2024 | 11:12 AM

పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై అన్నాడీఎంకేకు చెందిన చిల్లర నేతల వ్యాఖ్యలు పట్టించుకోబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) వ్యాఖ్యానించారు.

చెన్నై: పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై అన్నాడీఎంకేకు చెందిన చిల్లర నేతల వ్యాఖ్యలు పట్టించుకోబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) వ్యాఖ్యానించారు. ఆయన చేపట్టిన ‘ఎన్‌ మన్‌...ఎన్‌ మక్కల్‌’ పాదయాత్ర శనివారం ఉదయం తిరువళ్లూర్‌కు చేరుకోగా, పార్టీ జిల్లా నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అన్నామలై మీడియాతో మాట్లాడుతూ... అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయకుమార్‌ తనపై చేసిన విమర్శలపై స్పందించబోనని, ఆయన చిల్లర నేత అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తమిళ భాషను గౌరవిస్తూ, ఏ దేశానికి వెళ్లినా ఆ భాషకు ఘనత చేకూరుస్తున్నారని, అంతేకాకుండా రాష్ట్రానికి అన్ని వసతులు సమకూరుస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం పంపిఱీ చేసిన రూ.1,330 కోట్లను కరువు బాధితులకు పంపిణీ చేయవచ్చని అయితే, డీఎంకే ప్రభుత్వం ఆ నిధులను ఖర్చుచేయకుండా పక్కన పెట్టిందని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాట ఒంటరిగా బీజేపీ పోటీచేస్తే 21 శాతానికి పైగా ఓట్లు రాబట్టుకోవచ్చని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సర్వేలో వెల్లడైందని, తాజాగా ఇండియా టుడే సీ ఓటరు సర్వేలో 16 శాతం ఓట్లు వస్తాయని తెలిపిందని, దీన్ని బట్టి కమలం గుర్తుకు రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతోందని అన్నామలై అన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 11:12 AM

Advertising
Advertising