BJP state president: మాకు మార్గదర్శకుడు జీకే వాసన్.. బలమైన కూటమికి తొలి అడుగు
ABN, Publish Date - Feb 27 , 2024 | 12:13 PM
బీజేపీ కూటమిలో జీకే వాసన్ తొలి అడుగు వేశారని, రానున్న 100 రోజులు తమకు మార్గదర్శకం చూపే వ్యక్తిగా ఉంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) తెలిపారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
చెన్నై: బీజేపీ కూటమిలో జీకే వాసన్ తొలి అడుగు వేశారని, రానున్న 100 రోజులు తమకు మార్గదర్శకం చూపే వ్యక్తిగా ఉంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) తెలిపారు. బీజేపీతో తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) పొత్తు సోమవారం ఉదయం ఖరారైంది. ఈ నేపథ్యంలో జీకే వాసన్, అన్నామలై సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ... రాష్ట్రంలో బీజేపీ కూటమిలో తొలిపార్టీగా టీఎంసీ జతకట్టిందన్నారు. టీఎంసీకి ప్రత్యేక గౌరవం ఉందని, ప్రధాని మోదీని విడిచి వారు ఎన్నడూ వెళ్లలేదన్నారు. రాష్ట్రంలో ఆది నుంచి ప్రధాని మోదీకి మద్దతుగా గళం విప్పిన వ్యక్తి వాసన్ అన్నారు. భారీ మార్పులకు ఈరోజు నాంది పడిందని, 2024, 2026 ఎన్నికల్లో మార్పులు చూస్తారన్నారు. బలమైన కూటమి ఏర్పాటు చేయాలనేదే తమ లక్ష్యమన్నారు. మూడోసారి మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు బలమైన కూటమిగా మారాల్సి ఉందన్నారు. తాము అమలు చేసిన పథకాలు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితులు డీఎంకేకు లేవన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ ఉన్న వ్యతిరేకత బద్దలవుతుందన్నారు.
Updated Date - Feb 27 , 2024 | 12:13 PM