ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: సౌత్‌ చెన్నైలో తమిళిసై.. కోవైలో అన్నామలై.. 9మందితో బీజేపీ తొలి జాబితా

ABN, Publish Date - Mar 22 , 2024 | 12:13 PM

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీజేపీ(BJP) తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది.

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీజేపీ(BJP) తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) వాణిజ్య నగరం కోయంబత్తూరులో, మాజీ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై(Dr. Tamilisai) సౌత్‌ చెన్నైలో, కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌(Union Minister L. Murugan) నీలగిరి (రిజర్వుడు) నియోజకవర్గంలో, కేంద్ర మాజీ మంత్రి పొన్‌.రాధాకృష్ణన్‌ కన్నియాకుమారిలో పోటీ చేయనున్నారు. ఇదే విధంగా బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌ తిరునెల్వేలి నియోజకవర్గంలో, పెరంబలూరులో ఎస్‌ఆర్‌ఎం విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ పారివేందర్‌, సెంట్రల్‌ చెన్నైలో వినోద్‌ పి.సెల్వం, వేలూరులో న్యూజస్టిస్‌ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ ఏసీ షణ్ముగం, కృష్ణగిరిలో సి.నరసింహన్‌, నీలగిరి రిజర్వుడు నియోజకవర్గంలో డీఎంకే సిట్టింగ్‌ ఎంపీ ఎ.రాజాతో కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌ తలపడనున్నారు. ఇక సౌత్‌ చెన్నైలో డీఎంకే తరఫున పోటీ చేయనున్న తమిళచ్చి తంగపాండ్యన్‌తో డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఢీకొంటారు. పెరంబలూరులో ఐజేకే వ్యవస్థాపకుడు పారివేందర్‌ కమలం గుర్తుపై పోటీ చేస్తారని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. తొలుత ఈ జాబితాలో డీఎంకే ఎంపీ కనిమొళి పోటీ చేస్తున్న తూత్తుకుడిలో నయినార్‌ నాగేంద్రన్‌ పోటీ చేస్తారని పేర్కొన్నారు. కాసేపటికల్లా అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పు అంటూ మరో జాబితాను బీజేపీ కేంద్ర కమిటీ విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం నయినార్‌ నాగేంద్రన్‌ తూత్తుకుడిలో కాకుండా తిరునెల్వేలిలో పోటీ చేస్తారని పేర్కొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:13 PM

Advertising
Advertising