ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Independence Day 2024: ఆగస్ట్ 15 వేళ.. బీజేపీ హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమం

ABN, Publish Date - Aug 09 , 2024 | 07:35 AM

ఆగస్ట్ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తిరంగా ప్రచార కార్యక్రమం చేపట్టనుంది. అలాగే ఆగస్ట్ 12, 13, 14 తేదీల్లో స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించనుంది. అదే విధంగా ఈ మూడు రోజులు యుద్ద స్మారకాలను సందర్శించిన స్వాతంత్ర్య సమరంలో అమరులైన వారికి నివాళులర్పించనుంది. ఇక ఆగస్ట్ 14వ తేదీ దేశ విభజన జరిగిన నేపథ్యంలో మౌన ప్రదర్శన చేపట్టనుంది.

న్యూఢిల్లీ, ఆగస్ట్ 09: భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని జాతీయ పండగగా నిర్వహించాలని జులైలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాల్గొని జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి.. ఆ చిత్రాన్ని హర్‌తిరంగా.కామ్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు ప్రధాని మోదీ సూచించిన విషయం విధితమే.

Also Read: wayanad landslide: వయనాడ్‌కు ప్రధాని మోదీ..!

ఆగస్ట్ 11 నుంచి 14 వరకు..

ఆగస్ట్ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తిరంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనుంది. అలాగే ఆగస్ట్ 12, 13, 14 తేదీల్లో స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించనుంది. అదే విధంగా ఈ మూడు రోజులు యుద్ద స్మారకాలను సందర్శించిన స్వాతంత్ర్య సమరంలో అమరులైన వారికి నివాళులర్పించనుంది. ఇక ఆగస్ట్ 14వ తేదీ దేశ విభజన జరిగిన నేపథ్యంలో మౌన ప్రదర్శన చేపట్టనుంది.

Also Read: Maharashtra politics: తమ్ముడు నేటి నుంచి.. అన్నయ్య రేపటి నుంచి..

ఆగస్ట్ 11 నుంచి 15 వరకు..

ఆగస్ట్ 13 నుంచి 15వ తేదీ వరకు నివాసాలపై, వ్యాపార కేంద్రాలపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని ప్రజలకు బీజేపీ సూచించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని ఆ పార్టీ సీనియర్ నేత తరుణ్ చుగ్ పిలుపు నిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతి బూత్‌‌లో త్రివర్ణ పతాకం ఎగురవేయాలన్నారు.

Also Read: Viral: గర్ల్ ఫ్రెండ్‌ కోసం.. ఓ టీనేజర్ ఘనకార్యం

తరుణ్ చుగ్ ఆదేశాలు...

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు, మోర్చ బృందాలు, జిల్లా పార్టీ అధ్యక్షులు అంతా పాల్గొనాలన్నారు. ఆగస్ట్ 11 నుంచి ఆగస్ట్ 15వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని పార్టీ శ్రేణులకు తరుణ్ చుగ్ ఆదేశించారు. 2022 నుంచి దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రచారా కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుగుతుందని ఈ సందర్బంగా తరుణ్ చుగ్ గుర్తు చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 09 , 2024 | 07:39 AM

Advertising
Advertising
<