ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP-JDS: రామమందిరం ప్రారంభం తర్వాతే.. సీట్ల వ్యవహారం కొలిక్కి...

ABN, Publish Date - Jan 19 , 2024 | 01:29 PM

అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన తర్వాతే బీజేపీ-జేడీఎస్‌(BJP-JDS) మధ్య సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి రానుంది. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) ఢిల్లీలో మీడియాకు చెప్పారు.

- మాజీ సీఎం కుమారస్వామి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన తర్వాతే బీజేపీ-జేడీఎస్‌(BJP-JDS) మధ్య సీట్ల వ్యవహారం ఒక కొలిక్కి రానుంది. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) ఢిల్లీలో మీడియాకు చెప్పారు. ఢిల్లీలో హోంశాఖ మంత్రి అమిత్‌షాతోనూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP National President JP Nadda)తోనూ బుధవారం భేటీ అ య్యానని, ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయని వెల్లడించారు. అయితే వాటి వివరాలను చెప్పేందుకు నిరాకరించారు. రాష్ట్రంలో గత ఆరునెలలుగా కరువు విలయతాండవం చేస్తున్నా సిద్దరామయ్య(Siddaramaiah) ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పైగా కేంద్రంపైనే నిందలు వేస్తోందని కుమారస్వామి ఆరోపించారు. రాష్ట్రానికి సాధ్యమైనంత త్వరగా కరువు సాయం విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశానని తెలిపారు. కరువు సాయం విషయంలో రాజకీయం వద్దని ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి హితవు పలికారు. కేంద్రమంత్రిని కావాలన్న ఆశ తనకు లేదని, అసలు ఈ వదంతి ఎలా పుట్టిందో తనకు అర్థం కావడం లేదని కుమారస్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 28 నియోజకవర్గాల్లోనూ బీజేపీ, జేడీఎస్‌ అభ్యర్థుల విజయమే తన ముందున్న ఏకైక లక్ష్యమన్నారు.

Updated Date - Jan 19 , 2024 | 01:29 PM

Advertising
Advertising