ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP Candidate: బీజేపీ ఎంపీ అభ్యర్థి హఠాన్మరణం.. పోలింగ్ మరుసటి రోజే ఘటన!

ABN, Publish Date - Apr 20 , 2024 | 09:37 PM

మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి సర్వేష్ సింగ్(72) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. దేశ వ్యాప్తంగా మొదటి దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన తరువాతి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది.

లక్నో: మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి సర్వేష్ సింగ్(72) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. దేశ వ్యాప్తంగా మొదటి దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన తరువాతి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సర్వేష్ ఒక సారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సర్వేష్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతిపట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.


బీజేపీ పరివార్‌కు ఇది తీరని లోటని అన్నారు. "మొరాదాబాద్ అభ్యర్థి బీజేపీ నేత కున్వర్ సర్వేష్ కుమార్ సింగ్ మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి బీజేపీ పరివార్‌కు తీరని నష్టం. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి. దేవుడు వాళ్లకి మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రభు శ్రీరామ్.. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా" అని ఎక్స్‌లో యోగీ పోస్ట్ చేశారు.


ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి.. సర్వేష్ మృతి పట్ల సంతాపం తెలిపారు. గొంతు సమస్యతో ఆయనకి గతంలో ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. సమస్య పెరగడంతో ఆయన్ని వైద్య పరీక్షల కోసం శుక్రవారం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.

Odisha: ఒడిశాలో విషాదం.. పడవ మునిగిన ఘటనలో 50 మంది...

పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొరాదాబాద్‌లో సమాజ్ వాదీ పార్టీ నేత హసన్ విజయం సాధించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 10:08 PM

Advertising
Advertising