Bhole Baba: మహిళ ఆర్మీతో పటిష్ట భద్రత
ABN, Publish Date - Jul 03 , 2024 | 09:39 PM
హథ్రాస్ ఘటనతో భోలే బాబా అలియాస్ సురాజ్ పాల్ పేరు మారుమోగిపోతుంది. అతని నేపథ్యం.. గత చరిత్ర, లైంగిక సంబంధాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబాకు భద్రత కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేసుకున్నారు.
హథ్రాస్ ఘటనతో భోలే బాబా అలియాస్ సురాజ్ పాల్ పేరు మారుమోగిపోతుంది. అతని నేపథ్యం.. గత చరిత్ర, లైంగిక సంబంధాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబాకు భద్రత కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో గల మొయిన్ పురిలో భోలే బాబా ఆశ్రమం ఉంది. కోట్లాది రూపాయల డోనేషన్లు రావడంతో రాజ భవనంలా నిర్మించుకున్నారు. అందులో రోజు సత్సంగ్ నిర్వహిస్తుంటారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇతర చోట్ల భోలే బాబాపై కేసులు నమోదయ్యాయి. ప్రాణాలకు ముప్పు ఉందనే భావనకు వచ్చారు. గత ఎనిమిదేళ్ల నుంచి తన స్వగ్రామం బహదూర్ నగరికి వెళ్లలేదు.
ప్రాణాలకు ముప్పు ఉందని, దాడులు చేస్తారమోననే భయంతో కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేసుకున్నారు. భోలే బాబా భద్రత విభాగంలో మహిళ ఆర్మీ కూడా ఉన్నారు. ఆశ్రమం చివరలో బాబా గది ఉంటుంది. అందులోకి ఎంపిక చేసిన ఏడుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఏడుగురిలో మహిళలు, సేవ చేసే వారు ఉంటారు. వారు బాబాతో తొలినాళ్ల నుంచి కలిసి ఉంటున్నారు. రాత్రి 8 తర్వాత బాబా ఎవరిని కలువరు.
భద్రతా సిబ్బందికి కోడ్ ఉంటుంది. కోడ్ ఆధారంగా భద్రతా వ్యవహారాలు చూసుకుంటారు. నారాయణి సేన, గరుడ్ యోధ, హరి వాహక్ అనే బృందాలు బాబాకు 24 గంటలు రక్షణగా ఉంటారు. నారాయణ సేన పింక్ డ్రెస్ ధరిస్తారు. గరుడ్ యోధ బ్లాక్ దుస్తులు, హరి వాహక్ సభ్యులు బ్రౌన్ డ్రెస్సులు వేసుకుంటారు. బాబా కాన్వాయ్ వెంట 20 మంది బ్లాక్ కమాండోలు ఎప్పుడూ ఉంటారు. నారాయణ సేనకు చెందిన 50 మంది, హరి వాహక్ సభ్యులు 25 మంది ఉంటారు.
Updated Date - Jul 03 , 2024 | 09:39 PM