Population: లోక్ సభ ఎన్నికల తర్వాతే జనగణన.. నివేదికలో కీలక విషయాలు..
ABN, Publish Date - Mar 14 , 2024 | 08:36 PM
కరోనా కారణంగా 2021లో జరగాల్సిన జనగణన నిలిచిపోయింది. జనాభాలో ఇప్పటికే చైనాను వెనక్కి నెట్టిన భారత్ ( India ) మొదటి స్థానంలో నిలిచింది. అయితే అధికారిక లెక్కలు మాత్రం ఇంకా విడుదల కాలేదు.
కరోనా కారణంగా 2021లో జరగాల్సిన జనగణన నిలిచిపోయింది. జనాభాలో ఇప్పటికే చైనాను వెనక్కి నెట్టిన భారత్ ( India ) మొదటి స్థానంలో నిలిచింది. అయితే అధికారిక లెక్కలు మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఈ క్రమంలో బ్లూమ్ బర్గ్ వర్గాలు జనగణనపై కీలక విషయాలను ప్రకటించాయి. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాతే జనగణన ఉంటుందని తెలిపింది. అందుకు సంబంధించిన ఆర్థిక డేటా నాణ్యతను మెరుగుపరిచే మార్గాలను చర్చిస్తోందని వెల్లడించింది. చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించారు. పదేళ్ల తర్వాత అంటే 2021లో జరగాల్సిన జనగణన వివిధ కారణాలతో జరగలేదు.
2024-25 మధ్యంతర బడ్జెట్‌లో జనాభా లెక్కల కోసం ప్రభుత్వం రూ.1,277.80 కోట్లు కేటాయించింది. జనాభా గణనలో సుమారు మూడు లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని బ్లూమ్ బర్గ్ తెలిపింది. అంతే కాకుండా జనగణనకు దాదాపు 12 నెలల సమయం పట్టొచ్చని అంచనా వేసింది. దేశంలో తొలి జనగణన1881లో జరిగింది. అప్పటినుంచి ప్రతీ దశాబ్దం ప్రారంభంలో అది కొనసాగుతూ వస్తోంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 14 , 2024 | 08:36 PM