ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mumbai: ‘అతడి’ కారణంగా బార్ కూల్చివేత..

ABN, Publish Date - Jul 10 , 2024 | 04:45 PM

శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో కారు నడిపి.. ఒకరి మృతికి కారణమైన నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మిహిర్ షా మద్యం సేవించిన బార్‌ను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు బుధవారం రంగంలోకి దిగారు.

ముంబై, జులై 10: శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో కారు నడిపి.. ఒకరి మృతికి కారణమైన నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మిహిర్ షా మద్యం సేవించిన బార్‌ను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు బుధవారం రంగంలోకి దిగారు. అందులోభాగంగా ముంబైలోని జుహు తారా రోడ్డులోని సదరు బార్ వద్దకు ఈ రోజు ఉదయం జేసీబీలు చేరుకున్నాయి. నిందితుడు మిహిర్ షా తన స్నేహితులతో కలసి... శనివారం రాత్రి జుహు శివారులోని సదరు బార్‌లో మద్యం సేవించినట్లు పోలీసులు మంగళవారం గుర్తించి సీజ్ చేశారు. ఆ క్రమంలో బార్ కూల్చివేతకు అధికారులు చర్యలు చేపట్టారు.

Also Read: Pooja Khedkar : ట్రైయినీ ఐఏఎస్‌పై బదిలీ వేటు..


ఆదివారం తెల్లవారు జామున మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ వాహనాన్ని వేగంగా నడుపుతూ... వర్లీలో స్కూటర్‌పై వెళ్తున్న దంపతులను ఢీ కొట్టారు. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా, ఆమె భర్త మాత్రం గాయంగా పడ్డారు. అయితే మిహిర్ షా వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఆ కారు డ్రైవర్ అతడి పక్కనే ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తన తండ్రి రాజేశ్ షాకు మిహిర్ షా పోన్ చేశాడు. అతడు సంఘటన స్థలానికి చేరుకుని.. మిహిర్ షాను అక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించారు. ఆ తర్వాత.. మిహిర్ షా ఆచూకీ మంగళవారం వరకు లభ్యం కాలేదు.

Also Read: Minister Savitha: టీడీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి


మరోవైపు ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. రాజేశ్ షాతోపాటు కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఇక సోమవారం రాజేశ్ షా బెయిల్ పై విడుదలయ్యారు. నిందితుడు మిహిర్ షా కోసం 11 క్రైమ్ బ్రాంచ్ బృందాలను ముంబై పోలీసులు రంగంలోకి దించారు. దీంతో మంగళవారం ఉదయం మిహిర్ షాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకోవైపు కుమారుడు మద్యం మత్తులో కారు నడపడం.. ఒకరు మరణించడంతో శిండే వర్గానికి చెందిన శివసేన నాయకుడు రాజేశ్ షా ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో అతడిపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇక ఈ కేసులో మిహిర్ షాను 8 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచాలని స్థానిక కోర్టు ఆదేశించింది. దీంతో జులై 16 వరకు మిహిర్ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 04:50 PM

Advertising
Advertising
<