ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Delhi: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు.. కలకలం

ABN, Publish Date - Dec 09 , 2024 | 12:01 PM

దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్థితిపై మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. గతంలో ఈ తరహా ఘటనలు ఎప్పుడు లేవని తెలిపారు.

న్యూఢిల్లీ, డిసెంబర్ 09: దేశ రాజధాని న్యూఢిల్లీలో మళ్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దాదాపు 40కిపైగా పాఠశాలలకు ఈ తరహా బెదిరింపులు అందడంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులను మళ్లీ ఇళ్లకు పంపివేశారు. అనంతరం ఆయా పాఠశాలల్లో పోలీసులు, భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇవి నకిలీ బెదింపుగా గుర్తించామని ఢిల్లీ పోలీస్ పీఆర్వో సంజయ్ త్యాగి వెల్లడించారు. అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అందులోభాగంగా బాంబు బెదిరింపులు అందిన ఈ మెయిల్ ఐపీ అడ్రస్ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: ఆ కీలక మలుపు లేకుంటే.. జూన్ 2 గెలుపు లేనే లేదు


నగరంలోని అన్ని స్కూళ్లు, విద్యార్థులకు భద్రత కల్పిస్తామని ఈ సందర్బంగా సంజయ్ త్యాగి భరోసా ఇచ్చారు. డీపీఎస్ ఆర్కే పురం, జీడీ గోయోంకాతోపాటు దాదాపు 44 స్కూళ్లకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు అందాయని వివరించారు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం.. విద్యార్థులను ఇంటికి పంపి.. అనంతరం దీనిపై పోలీసులకు సమాచారం అందించాయని తెలిపారు. ఆదివారం రాత్రి 11.38 గంటలకు పాఠశాల భవనాల్లో పలు బాంబులు అమర్చినట్లు ఈ మెయిల్ ద్వారా పాఠశాలల యాజమాన్యాలకు బెదిరింపులు వచ్చాయన్నారు. ఈ బాంబులు పేలకుండా ఉండాలంటే.. రూ. 30 వేల యూఎస్ డాలర్లు తమకు అందజేయాలని ఈ మెయిల్ పంపిన వ్యక్తులు డిమాండ్ చేశారని వివరించారు.

Also Read: Cauliflower: క్యాలీఫ్లవర్ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?


మరోవైపు దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్థితిపై మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. గతంలో ఈ తరహా ఘటనలు ఎప్పుడు లేవని గుర్తు చేశారు. దీనిపై ఢిల్లీ ప్రజలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని తన ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.


ఇక ఢిల్లీ వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ముఖ్యమంత్రి అతిషి సైతం స్పందించారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఇంతకు ముందెన్నడూ ఇలా లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలకు భద్రత కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ ఘెరంగా విఫలమైందని ఆరోపించారు. ఇక ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సైతం స్పందించారు. ఢిల్లీలో ఇంత భయానక స్థితిని తాము గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. తమ పిల్లలు సురక్షితంగా లేరనే విషయం.. తమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తుందన్నారు. ఢిల్లీలో బీజేపీ భయానక వాతావరణాన్ని సృష్టించిందని ఆయన ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతి భద్రతలు కుప్పకూలాయని మనీశ్ సిసోడియా విమర్శించారు.

For National News And Telugu News

Updated Date - Dec 09 , 2024 | 12:10 PM