ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Varanasi : వారాణసీ విమానానికి బాంబు బెదిరింపు

ABN, Publish Date - May 29 , 2024 | 05:50 AM

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారాణసీ వెళ్తున్న ఇండిగో(6ఈ2211) విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణికులు కకావికలమయ్యారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఈ విమానం బయలుదేరాల్సి ఉండగా.. ఆగంతుకులు

అప్రమత్తమైన ఇండిగో

అత్యవసర ద్వారం నుంచి దిగిన ప్రయాణికులు

న్యూఢిల్లీ, మే 28: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారాణసీ వెళ్తున్న ఇండిగో(6ఈ2211) విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణికులు కకావికలమయ్యారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఈ విమానం బయలుదేరాల్సి ఉండగా.. ఆగంతుకులు టాయ్‌లెట్‌లో టిష్యూపేపర్‌పై ‘బాంబ్‌ బ్లాస్ట్‌ ఎట్‌ 30 మినట్స్‌’ అని రాశారు. ఆ పేపర్‌ను గమనించిన విమాన సిబ్బంది వెంటనే కంట్రోల్‌రూమ్‌ని అప్రమత్తం చేశారు. రన్‌వేకు దూరంగా విమానాన్ని తీసుకువెళ్లి.. ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి కిందకు దించారు. ఆ తర్వాత భద్రత సిబ్బంది విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులను ఉదయం 11 గంటలకు అదే విమానంలో వారాణసీకి తరలించారు. కాగా.. ఈ నెల 15న కూడా ఢిల్లీ నుంచి వడోదర వెళ్లే ఎయిరిండియా విమానానికి ఇలాంటి బాంబు బెదిరింపే వచ్చింది. న్యూఢిల్లీలోని పలు ఆస్పత్రులు, పాఠశాలలకు కూడా వరుసగా బాంబు బెదిరింపు కాల్స్‌ వస్తుండడం తెలిసిందే..!

Updated Date - May 29 , 2024 | 05:50 AM

Advertising
Advertising