ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాంబు ఉందంటూ 169 ఫేక్ కాల్స్.. విమానాలతో ఆటాడుకుంటున్న ఆకతాయిలు

ABN, Publish Date - Oct 25 , 2024 | 05:05 PM

గత వారం రోజులుగా దేశంలోని ఎయిర్‌లైన్స్ సంస్థల విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కాల్స్ నకిలీవే అయినప్పటికీ ఎవరు చేస్తున్నారనేది అంతుచిక్కడం లేదు. ఈ మేరకు ఇంటెలిజెన్సీ ఏజెన్సీలు రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో పర్యాటక రంగానికి నష్టం వాటిల్లడమే కాకుండా ప్రయాణీకులు కూడా తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

bomb threats

విమానానికి బాంబు బెదిరింపు.. ఈ మధ్య తరచుగా వినిపిస్తోన్న మాట. విమానాలు, రైళ్లు, స్కూళ్లకు ఈ బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. గత రెండు వారాల నుంచి విమానాలకు వస్తున్న బెదిరింపు కాల్స్‌తో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఒకటి రెండు కాదు.. వారం రోజుల వ్యవధిలో ఏకంగా 169 ఫేక్ కాల్స్ వచ్చాయి. ఈ ఫేక్ కాల్స్‌ను కేంద్ర పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. నిందితులను కచ్చితంగా పట్టుకొని శిక్షిస్తామని హెచ్చరించింది. అయినప్పటికీ ఈ బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. అంతర్జాతీయ మార్గాల్లో నడిచే విమానాలకు ఈ బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. 80కి పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.


ఈ బెదిరింపు కాల్స్ అంతకంతకూ పెరిగిపోతుండడంతో భారతీయ విమానయాన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది. గురువారం ఒక్క రోజే ఏకంగా 95 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎయిరిండియా, ఇండిగో, విస్తారా, ఆకాశ ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్‌తో పాటు ఇతర ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా శంషాబాద్ నుంచి చంఢీగఢ్ వెళుతున్న విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమానంలోని 130 మంది ప్రయాణీకులను కిందికి దించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.


మరోవైపు రెండు రోజుల క్రితం దేశంలోని సీఆర్‌పీఎఫ్ స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు సందేశాలను పంపించారు. నైట్రైట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్టు మెయిల్స్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న రెండు సీఆర్‌పీఎఫ్ స్కూళ్లకు సికింద్రాబాద్‌లోని మరో సీఆర్‌పీఎఫ్ స్కూల్‌కి ఈ బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ అర్ధరాత్రి సమయంలో వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఢిల్లీలోని ఓ స్కూల్ వద్ద బాంబు పేలడంతో భయాందోళనలు నెలకొన్నాయి.

మరోవైపు తిరుపతిలోని నాలుగు హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. అర్ధరాత్రి సమయంలో మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు. హోటళ్లలోని ప్రతి రూమ్‌ని డాగ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీ చేశారు.


జీవితఖైదు విధించేలా కేంద్రం చర్యలు

బెదిరింపు కాల్స్, మెయిల్స్ పెడుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి కాల్స్ చేసేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టసవరణ చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు నో ఫ్లయర్స్ జాబితాలో చేర్చుతామని పేర్కొంది. అయినప్పటికీ ఈ బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. ఈ వరుస బెదిరింపు కాల్స్ పౌర విమానయాన రంగానికి భారీ నష్టం జరుగుతోంది. అంతేకాదు ప్రయాణీకులకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియాలో విమానాలకు వచ్చిన బెదిరింపులు నకిలీవని తేలినప్పటికీ వాటిని పోస్ట్ చేసిన వ్యక్తులు ఎవరనేది అధికారులు గుర్తించలేకపోతున్నారు.


ఇవి కూడా చదవండి

ఏడాదికి రూ.25 లక్షల జీతం.. అయినా మిగలడం లేదట

బంగారం లేదా వెండి.. ధన త్రయోదశి రోజు ఏది కొంటే మంచిది..

Updated Date - Oct 25 , 2024 | 05:15 PM