ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Coldplay: కోల్డ్‌ప్లే కాన్సర్ట్.. బుక్‌మైషో వెబ్‌సైట్ క్రాష్

ABN, Publish Date - Sep 22 , 2024 | 09:54 PM

కోల్డ్ ప్లే కాన్సర్ట్ టిక్కెట్లు బుకింగ్ ప్రారంభానికి కొద్ది సెకెన్ల ముందే బుక్‌మైషో వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. ఇది సంగీత ప్రియుల్లో అసహనానికి దారి తీసింది.

ఇంటర్నెట్ డెస్క్: కోల్డ్ ప్లే కాన్సర్ట్ టిక్కెట్లు బుకింగ్ ప్రారంభానికి కొద్ది సెకెన్ల ముందే బుక్‌మైషో వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున జనాలు వెబ్‌‌సైట్ సందర్శించడంతో ట్రాఫిక్ తాకిడికి వెబ్ సైట్ స్తంభించిపోయింది. ఇది సంగీత ప్రియుల్లో అసహనానికి దారి తీసింది. బ్రిటన్‌‌కు చెందిన రాక్ బ్యాండ్ ప్రస్తుతం మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్‌లో భాగంగా ఇండియాకు రానుంది. ముంబైలోని ప్రముఖ డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో వచ్చే ఏడాది జనవరి 18, 19 తేదీల్లో కాన్సర్ట్ ఏర్పాటు చేశారు (Mumbai).

APY: దాదాపు 7 కోట్లకు చేరిన అటల్ పెన్షన్ యోజన సబ్‌స్క్రైబర్ల సంఖ్య


దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఈ రాక్ బ్యాండ్ భారత్‌కు రానుండటంతో అభిమానల్లో ఉత్సాహం పతాక స్థాయికి చేరుకుంది. షో ప్రమోటర్లు కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యూజిక్ అనుభూతి మిగిల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో అబుదాబీ, సియోల్, హాంగ్‌‌కాంగ్‌లో కూడా ఈ బ్యాండ్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వరల్డ్ టూర్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

Boat Capasises: గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం


ఇక అక్టోబర్ 4న కోల్డ్ ప్లే బ్యాండ్ తన కొత్త ఆల్బమ్ మూన్ మ్యూజిక్‌ను విడుదల చేయనుంది. అయితే, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఈ ఆల్బమ్ కోసం పూర్తిస్థాయిలో రీసైకిల్డ్ ప్లాస్టిక్ వినియోగించారు.

కాగా, కోల్డ్ ప్లే 2016లో తొలిసారిగా భారత్‌లో పర్యటించింది. ముంబైలో జరిగిన గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చింది. 1997లో ఉనికిలోకి వచ్చిన ఈ రాక్ బ్యాండ్‌లో ప్రధాన గాయకుడు క్రిస్ మార్టిన్‌తో పాటు జానీ బక్‌లాండ్, గయ్, బెర్రీమన్, విల్ చాంపియన్ ఉన్నారు. ఈ బ్యాండ్ రూపొందించిన ‘‘ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’’, ‘‘డోన్ట్ ప్యానిక్’’, వివా ల వీదా, ఇన్‌ మై ప్లేస్ గీతాలు ప్రపంచవ్యా్ప్తంగా ఆదరణ పొందాయి.

INS Vikrant: పశ్చిమ నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌

Read Latest and National News

Updated Date - Sep 22 , 2024 | 10:04 PM