Uttar Pradesh: మళ్లీ తోడేలు దాడి: బాధిత కుటుంబాలతో సీఎం యోగి భేటీ
ABN, Publish Date - Sep 16 , 2024 | 10:57 AM
ఉత్తరప్రదేశ్‌లో బహరాయిచ్ జిల్లాలో మనుషులపై తోడేళ్లు దాడి ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి బహరాయిచ్ సబ్ డివిజన్ పరిధిలో డాబాపై నిద్రిస్తున్న అర్మణ్ అలీ(13)పై తోడేలు దాడి చేసింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డారు.
లఖ్‌నవూ, సెప్టెంబర్ 16: ఉత్తరప్రదేశ్‌లో బహరాయిచ్ జిల్లాలో మనుషులపై తోడేళ్లు దాడి ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి బహరాయిచ్ సబ్ డివిజన్ పరిధిలో డాబాపై నిద్రిస్తున్న అర్మణ్ అలీ(13)పై తోడేలు దాడి చేసింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని బహరాయిచ్ మెడికల్ కాలేజీకి తరలించారు.
Pedana: పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు
జిల్లాలో వరుస తోడేళ్ల దాడి ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహరాయిచ్ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం తోడేళ్ల దాడిలో గాయపడిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం వారిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. తోడేళ్ల భారీ నుంచి రక్షిస్తామని జిల్లా ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. అందుకోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వారికి వివరించారు.
జిల్లాలో తోడేళ్ల సంచారం లేకుండా చేసేందుకు అటవీ శాఖ, పోలీసులతోపాటు జిల్లా అధికారులు కలిసి పని చేస్తారని వారికి భరోసా కల్పించారు. ఇప్పటికే తోడేళ్ల దాడిని విపత్తుగా నిర్ణయించిన సంగతిని సీఎం యోగి వారికి గుర్తు చేశారు. తోడేళ్ల దాడిలో మరణించిన కుటుంబానికి రూ. 5 లక్షల నష్ట పరిహారంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ దాడిలో గాయపడిన వారికి యాంటీ రాబిస్ ఇంజెక్షన్లు ద్వారా చికిత్స అందిస్తుందని ఆయన వివరించారు.
Tripura: గంటల వ్యవధిలో మరో దారుణం
ఉత్తరప్రదేశ్‌లో బహరాయిచ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తొడేళ్లు వరుసగా దాడి చేస్తున్నాయి. ఈ దాడిలో ఇప్పటి వరకు 10 మంది మరణించారు. 35 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ బేడియా పేరిట యోగి ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 6 తోడేళ్లను అటవీ శాఖ అధికారులు బంధించిన విషయం విధితమే.
For More National News and Telugu News
Updated Date - Sep 16 , 2024 | 10:57 AM