Budget 2024: 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవే..!! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
ABN, Publish Date - Jan 31 , 2024 | 10:30 AM
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ ప్రసంగం చదువుతారు. గత పదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ప్రస్తావిస్తారు.
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget 2024) ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. గత పదేళ్లలో నరేంద్ర మోదీ (PM MODI) ప్రభుత్వం సాధించిన విజయాల గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ ప్రసంగంలో చదువుతారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం నాడు మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదిస్తారు. ప్రతిపక్షాలు సభకు సహకరించాలని అధికార బీజేపీ కోరుతుంది. సభ సజావుగా జరిగేలా చూడాలని నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో రిక్వెస్ట్ చేసింది. అయినప్పటికీ విపక్ష సభ్యులు వినిపించుకునేలా లేరు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల ఇబ్బందులు, మణిపూర్‌లో హింస సభలో గురించి ప్రస్తావిస్తామని కాంగ్రెస్ నేత కే సురేష్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి మధ్యంతర బడ్జెట్‌లో అయినా పశ్చిమ బెంగాల్‌కు నిధులు విడుదల చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 31 , 2024 | 10:30 AM