ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Canada : ఉగ్రవాది నిజ్జర్‌కు కెనడా నివాళి

ABN, Publish Date - Jun 20 , 2024 | 03:57 AM

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంటు అతనికి నివాళి అర్పించింది. మంగళవారం పార్లమెంటులో సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.

అహేతుకం

ఖలిస్థానీ ఉగ్రవాది హతమై ఏడాదైన

సందర్భంగా ఆ దేశ పార్లమెంటు మౌనం

తీవ్రంగా స్పందించిన భారత్‌

కనిష్క విమాన మృతులకు సంతాపం

23న కెనడాలోని ఓ పార్కులో కార్యక్రమం

నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి

న్యూఢిల్లీ, జూన్‌ 19: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంటు అతనికి నివాళి అర్పించింది. మంగళవారం పార్లమెంటులో సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. దీనిపై స్పందించిన భారతదేశం 1985లో ఎయిర్‌ ఇండియాకు చెందిన కనిష్క విమానాన్ని ఉగ్రవాదులు బాంబుతో పేల్చివేసిన ఘటనలో మరణించిన 329 మంది ప్రయాణికుల స్మారక కార్యక్రమాన్ని ప్రకటించింది.

కెనడాలోని స్టాన్లీ పార్కు వద్ద ఉన్న సెపెర్లీ క్రీడామైదానంలో ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు స్మారక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వాన్కోవెర్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ప్రపంచానికే ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌ ముందుంటుందన్నారు. 2024 జూన్‌ 23న ఆ మృతుల 39వ వర్ధంతి అని తెలిపారు. 1984లో ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు ప్రతీకారంగానే సిక్కు ఉగ్రవాదులు కనిష్క విమానాన్ని పేల్చివేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

కాగా, భారత్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్థానీ టైగర్‌ ఫోర్స్‌(కేటీఎ్‌ఫ)కు చీఫ్‌గా నిజ్జర్‌ వ్యవహరించాడు. భారతదేశం ప్రకటించిన 40 మంది ఉగ్రవాదుల జాబితాలో నిజ్జర్‌ పేరు కూడా ఉంది. సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే వేర్పాటువాద సంస్థలోనూ అతని భాగస్వామ్యం ఉంది. 2017లో భారతదేశంలోని లూథియానాలో బాంబు పేలుడు, పాటియాలాలో ఓ ఆలయం వద్ద బాంబు పేలుడులో అతని పాత్ర ఉన్నట్టు పంజాబ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. కెనడాలో గతేడాది జూన్‌ 18న నిజ్జర్‌ను కొందరు కాల్చిచంపారు. ఈ హత్యలో భారత ప్రభుత్వ పాత్ర ఉందని కెనడా ఆరోపించడంతో ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి.

Updated Date - Jun 20 , 2024 | 03:57 AM

Advertising
Advertising