Bangladesh Clashes: భారత్ - బంగ్లాల మధ్య రైళ్లు, విమానాల రద్దు.. పరిస్థితిని మోదీకి వివరించిన జైశంకర్
ABN, Publish Date - Aug 05 , 2024 | 08:42 PM
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేసి సోమవారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితిని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీకి(PM Modi) వివరించారు.
ఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేసి సోమవారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితిని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీకి(PM Modi) వివరించారు. బంగ్లాదేశ్‌లోని అశాంతి భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అస్థిరతకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశంలో అస్థిరత భారత్‌లోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా హెచ్చరించారు. బంగ్లాదేశ్ ప్రయోజనాలను రక్షించడానికి అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. ఇక బంగ్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారత్ నుంచి బంగ్లాదేశ్ వెళ్ళే ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లుఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు సహకరించాలని కోరింది.
కేబినెట్ సబ్ కమిటీ భేటీ
బంగ్లాదేశ్‌లో పరిణామాల నేపథ్యంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉప సంఘం అత్యవసరం భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. పొరుగు దేశంలో తాజా పరిస్థితులు, దేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించనున్నారు. ప్రధాని మోదీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, అజిత్ ధోవల్ పాల్గొన్నారు.
ఎల్ఐసీ మూసివేత
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఉండటంతో అక్కడి భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) తమ కార్యాలయాలను మూసేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఆగస్టు 7 వరకు తమ కార్యాలయాలు మూసేస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. బంగ్లా ప్రభుత్వం సోమవారం నుంచి ఆగస్టు 7 వరకు దేశవ్యాప్త కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.
హసీనాకు ఆశ్రయమివ్వడానికి భారత్ ససేమిరా?
రాజీనామా అనంతరం భారత్‌కి వచ్చిన షేక్ హసీనాకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు తాత్కాలికంగా సహాయం, రక్షణ కల్పించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. కానీ షేక్ హసీనాకు పూర్తి స్థాయిలో ఇక్కడే ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించినట్లు సమాచారం. నరేంద్ర మోదీ ప్రభుత్వం హసీనాకు రక్షణ కల్పించి, ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా లేదని జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. దాంతో షేక్ హసీనా భారత్ నుంచి యూరప్ దేశాలకు వెళ్లున్నారట. ఆమె ఫిన్లాండ్ లేక స్విట్జర్లాండ్‌కి వెళ్తారని వార్తలు వెలువడుతున్నాయి.
Bangladesh Clashes: భారత్ - బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్.. అదనపు బలగాలను మోహరిస్తున్న బీఎస్ఎఫ్
For Latest News and National News click here
Updated Date - Aug 05 , 2024 | 09:03 PM