ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lokayukta Raid: నోట్లు మింగిన అవినీతి అధికారి

ABN, Publish Date - Dec 23 , 2024 | 03:14 AM

లోకాయుక్త అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఓ అవినీతి అధికారి చేతిలోని కరెన్సీ నోట్లను గుటుక్కున మింగేశాడు.

కక్కించిన లోకాయుక్త బృందం

బెంగళూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): లోకాయుక్త అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఓ అవినీతి అధికారి చేతిలోని కరెన్సీ నోట్లను గుటుక్కున మింగేశాడు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌ దస్తగిరి అలీ.. ఓ స్వచ్ఛంద సంస్థకు అనుమతి పత్రం ఇచ్చేందుకు రూ.2వేలు లంచం డిమాండ్‌ చేశాడు. ఆ సంస్థకు చెందిన భీమనగౌడ అనే వ్యక్తి లోకాయుక్త అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 21న భీమనగౌడ రూ.500 నోట్లు నాలుగు దస్తగిరి అలీకి ఇవ్వగా అవి చేతిలో ఉన్న సమయంలోనే లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. అంతలోనే ఆ నోట్లను దస్తగిరి ఉండలా చుట్టి నోట్లో వేసుకున్నాడు. లోకాయుక్త అధికారులు ఆ నోట్లను కక్కించి కేసు నమోదు చేశారు.

Updated Date - Dec 23 , 2024 | 03:15 AM