Kolkata Trainee Doctor Case: కోల్‌కతా కేసు నిందితుడి సైకో టెస్ట్‌లో షాకింగ్ విషయాలు.. రెడ్ లైట్ ఏరియాకు..
ABN, Publish Date - Aug 23 , 2024 | 11:04 AM
కోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హాత్యాచారం(Kolkata trainee doctor case) చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో సివిక్ పోలీస్ వాలంటీర్, నిందితుడు సంజయ్ రాయ్‌కి గురువారం (ఆగస్టు 22న) సైకలాజికల్ టెస్ట్ నిర్వహించింది సీబీఐ(CBI). ఆ క్రమంలో సీబీఐ బృందం షాకింగ్ సమాచారం సేకరించినట్లు తెలిపింది.
కోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హాత్యాచారం(Kolkata trainee doctor case) చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో సివిక్ పోలీస్ వాలంటీర్, నిందితుడు సంజయ్ రాయ్‌కి గురువారం (ఆగస్టు 22న) సైకలాజికల్ టెస్ట్ నిర్వహించింది సీబీఐ(CBI). ఆ క్రమంలో సీబీఐ బృందం షాకింగ్ సమాచారం సేకరించినట్లు తెలిపింది. నిందితుడు సంజయ్ రాయ్‌కి మొబైల్‌లో పోర్న్ చూడటం అలవాటు ఉందని చెప్పింది. అంతేకాదు అతను క్రమంగా రెడ్ లైట్ ఏరియాకు కూడా వెళ్లేవాడని సీబీఐ చెప్పింది. ఆ క్రమంలో నిందితుడు శృంగారానికి బానిసై ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
ఒప్పుకున్నాడు
నిందితుడు సంజయ్ రాయ్‌కి సీబీఐ(CBI) మానసిక విశ్లేషణ పరీక్ష నిర్వహించింది. అందులో ఆయన వ్యక్తిగత జీవితంపై పలు ప్రశ్నలను సంధించారు. సంజయ్ రాయ్‌కి అతని భార్యతో సంబంధం ఎలా ఉందని అడిగారు. అప్పుడు తాను రెడ్ లైట్ ఏరియాకు చాలాసార్లు వెళ్లేవాడినని, అమ్మాయిలతో సరసాలాడడం తన స్వభావమని ఒప్పుకున్నాడు. అయితే ఘటన జరిగిన రోజు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లారా అనే ప్రశ్నపై కూడా సీబీఐ బృందానికి సమాచారం అందించాడు. సంజయ్ రాయ్ నుంచి సీబీఐ బృందానికి దొరికిన మొబైల్ ఫోన్‌లో హింసాత్మక, అసభ్యకర వీడియోలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఘటన రోజు
ఈ ఘటన జరిగిన రోజు తాను పోర్న్ వీడియో చూశానని సంజయ్ రాయ్ ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణం గురించి కూడా సంజయ్ చెప్పాడు. నిందితుడు వైద్యుల బృందం ముందు తన కష్టాలను వివరిస్తున్నప్పుడు, అతని ముఖంలో ఎటువంటి పశ్చాత్తాపం లేదా భయం లేదు. ప్రశ్నలకు సమాధానమిస్తూ నవ్వుతూ ఉండటం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అంతేకాదు నేరం గురించి సిగ్గులేకుండా చెప్పేవాడని వైద్యులు అన్నారు.
డీఎన్‌ఏ ఫలితాల కోసం
అంతేకాదు సంజయ్ రాయ్ సాధారణ వ్యక్తిగా కనిపించినప్పటికీ ఒక జంతు ప్రవృత్తి ఉన్న వ్యక్తి, లైంగిక వక్రబుద్ధి గల వ్యక్తి అని ఈ నివేదిక వెల్లడించింది. నేరం జరిగిన ప్రదేశంలో సంజయ్ రాయ్ ఉన్నట్లు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో నిర్ధారించామన్నారు. అయితే డీఎన్‌ఏ పరీక్షల ఫలితాల కోసం తాము ఎదురుచూస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితుడు సంజయ్ రాయ్ మానసిక విశ్లేషణ ప్రొఫైల్‌ను సీబీఐ సిద్ధం చేసింది. దీని కారణంగా నిందితుడి వ్యక్తీకరణలు ప్రవర్తన నుంచి సంఘటనను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి:
High court of Mumbai : ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేయరా?
Delhi : 7 వేల కోట్లతో సైన్యానికి ఆయుధాలు
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 23 , 2024 | 11:07 AM