CBI: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకు సీబీఐ సంచలన రిపోర్ట్
ABN, Publish Date - Aug 22 , 2024 | 12:39 PM
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆందోళన చేస్తున్న వైద్యులను విధులకు హాజరుకావాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తున్నామని వైద్యుల సంఘాలు తెలిపాయి.
ఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆందోళన చేస్తున్న వైద్యులను విధులకు హాజరుకావాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీ చేస్తూనే ఆందోళన చేస్తున్నామని వైద్యుల సంఘాలు తెలిపాయి. విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్ లీవ్ కట్ చేసి వేధిస్తున్నారని ట్రైనీ డాక్టర్లు సుప్రీంకోర్టుకు వెల్లడించారు. మొదట విధులకు హాజరుకావాలని సీజేఐ సూచించారు. నేషనల్ టాస్క్‌ఫోర్స్‌లో రెసిడెంట్ డాక్టర్లను కూడా చేర్చాలని ట్రైనీ డాక్టర్లు పేర్కొన్నారు. రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను ఎన్‌టీఎఫ్ వింటుందని సీజేఐ భరోసా ఇచ్చారు. కమిటీలో భాగస్వాములుగా ఉండడానికి, కమిటీ ఎదుట వాదన చెప్పడానికి తేడా ఉంటుందని న్యాయవాదులు వెల్లడించారు. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ సంచలన రిపోర్ట్‌ను వెలువరించింది.
AP Government: అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
రేప్, మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది. తల్లిదండ్రులను సైతం తప్పుదారి పట్టించారని తెలిపింది. శవ దహనం తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సీబీఐ పేర్కొంది. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని వెల్లడించింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ స్టేటస్‌కో రిపోర్టును కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందించారు. సీజేఐ డివై చంద్ర చూడ్ ధర్మాసనం సీబీఐ రిపోర్టును పరిశీలించింది. లోకల్ పోలీసుల నుంచి సేకరించిన సమాచారంతో పాటు సీబీఐ సేకరించిన ఆధారాలను కోర్టుకు సొలిసిటర్ జనరల్ అందించారు.
Secretariat: సచివాలయంలో పాతుకుపోయిన వైసీపీ అనుకూల అధికారులు.. వారు చేస్తున్న బాగోతం ఇదీ!
సీబీఐ అందజేసిన సీల్డ్ కవర్ స్టేటస్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించింది. ఘటన జరిగిన 5వ రోజు దర్యాప్తు రిపోర్టు తమ చేతికి అందిందని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అప్పటికే చాలా వరకూ మార్చేశారని వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కటీ వీడియోగ్రఫీ జరిగిందని బెంగాల్ ప్రభుత్వం తరుఫున కపిల్ సిబల్ తెలిపారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. సీనియర్ డాక్టర్లు, సహచరులు ఒత్తిడి చేయడంతోనే వీడియోగ్రఫీ చేశారన్నారు. అంటే అక్కడ కవర్-అప్ ఏదో జరుగుతుందని వారంతా భావించారని సొలిసిటర్ జనరల్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
BC Janardhan: ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరం
Updated Date - Aug 22 , 2024 | 12:39 PM