Central Budget: కేంద్ర బడ్జెట్‌లో ఐటీ ఉపశమనం!
ABN, Publish Date - Dec 29 , 2024 | 04:06 AM
వచ్చే ఫిబ్రవరి1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను తగ్గించే అవకాశం
కొత్త పన్ను విధానం వారికి వర్తింపు!
న్యూఢిల్లీ, డిసెంబరు 28: వచ్చే ఫిబ్రవరి1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా వార్షికంగా రూ.15 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారు చెల్లించే ఆదాయం పన్నును తగ్గించాలని కేంద్రం యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, పన్ను తగ్గింపు ఉపశమనం 2020 పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధానంలో ఇంటి అద్దెలు వంటి మినహాయింపులను మినహాయించారు. ఈ విధానంలో వార్షిక ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటే 5ు నుంచి 20ు వరకు పన్ను విధిస్తున్నారు. అంతకు మించిన ఆదాయం ఉన్న వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. కాగా, పన్ను రేట్లను తగ్గించడం వల్ల ఎక్కువ మంది కొత్త విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
Updated Date - Dec 29 , 2024 | 04:06 AM