ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi విమానశ్రయంలో పైకప్పు కూలిన ఘటనపై స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు

ABN, Publish Date - Jun 28 , 2024 | 11:13 AM

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో టెర్మినల్ వన్ విమానశ్రయంలో పైకప్పు కూలిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. పైకప్పు కూలిన ఘటనపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని ఎక్స్‌లో వెల్లడించారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో టెర్మినల్ వన్ (Terminal One) విమానశ్రయం (Airport)లో పైకప్పు కూలిన (Roof collapsed) ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Rammohan Naidu) స్పందించారు. పైకప్పు కూలిన ఘటనపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని ఎక్స్‌ (X)లో వెల్లడించారు. టెర్మినల్ వన్ వద్ద ఉన్న ప్రయాణీకులు అందరికీ సహాయం వెంటనే అందించాలని అధికారులను ఆదేశించినట్టు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఘటనలో ఒకరు చనిపోయారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం అందజేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.


గత రాత్రి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1లో పైకప్పు కూలింది. ఈ ఘటనను విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం 5గంటల సమయంలో టెర్మినల్-1లో ప్రయాణీకులు నిష్క్రమించే ప్రదేశంలో పై కప్పు కూలిందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన వెంటనే అత్యవసర సహాయ బృందాలు చర్యలు చేపట్టాయని, పలువురు గాయపడ్డారని, వారికి వైద్య సాయం అందించినట్లు తెలిపారు. వెంటనే... టెర్మినల్ 1 నుంచి విమాన సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా చెక్ ఇన్ కౌంటర్లు అన్ని మూసి వేశామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.


ఢిల్లీలో శుక్రవారం తెల్లవారు జాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో 2 గంటల పాటు ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైకులు నీట మునిగాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు..

రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు..

జగన్ సర్కర్ చెప్పిందే.. కలెక్టర్లు పాటించారు..

ఓటమితో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 28 , 2024 | 11:28 AM

Advertising
Advertising