ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Budget 2024: 10 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించాం.. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABN, Publish Date - Jan 31 , 2024 | 12:40 PM

నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో సాధించిన విజయాలను బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. హిందువుల చిరకాల కోరిక రామ మందిర నిర్మాణం, చంద్రయాన్-3, జీ20 సమావేశాలు, ఏషియన్ గేమ్స్ నిర్వహించిందని గుర్తుచేశారు.

ఢిల్లీ: నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వం గత పదేళ్లలో సాధించిన విజయాలను బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. కొత్త పార్లమెంట్ భవనంలో బడ్జెట్ ప్రసంగం చదివిన ద్రౌపది ముర్ము.. 21వ శతాబ్దంలో భారతదేశం కొత్త సంప్రదాయాలకు తెరతీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త భవనంలో ప్రభుత్వ పాలసీల గురించి సుహృద్భావ వాతావరణంలో చర్చ జరుగుతుందని అభిప్రాయ పడ్డారు.

నిరీక్షణకు తెర

భారత జాతి ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల నిరీక్షణకు తెరదించుతూ మోదీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివరించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఐదు శతాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఆ కల ఈ రోజు నెరవేరింది. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించడం మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని గుర్తుచేశారు. సైనికుల కోసం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం ప్రవేశపెట్టామని వివరించారు. ఇప్పటికే మాజీ సైనిక ఉద్యోగులు రూ.1 లక్ష కోట్లు అందజేశామని స్పష్టంచేశారు. కరోనా మహమ్మారిని ధీటుగా ఎదుర్కొన్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో తమ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచేందుకు పటిష్ఠ చర్యలు తీసుకున్నామని వివరించారు. మద్య తరగతి వారిపై భారం పడనివ్వలేదని వెల్లడించారు.

ధీటుగా రక్షణరంగం

మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అనేవి మోదీ ప్రభుత్వ బలం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. రక్షణ రంగం కోసం రూ.1 లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని వివరించారు. చంద్రుని దక్షిణ ధృవం చేరిన తొలి దేశంగా భారత్ నిలిచిందని స్పష్టం చేశారు. జీ 20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించామని, దీంతో భారత బలం ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. ఏషియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచారని వెల్లడించారు. 100 మెడల్స్ సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. అటల్ టన్నెల్ నిర్మాణం జరిగిందని స్పష్టంచేశారు.

మరిన్ని బడ్జెట్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 31 , 2024 | 12:41 PM

Advertising
Advertising