వాట్సా్‌పలోనూ చాట్‌జీపీటీ
ABN, Publish Date - Dec 20 , 2024 | 03:40 AM
ఇటీవలి కాలంలో చాట్ జీపీటీ విస్తృతంగా ప్రజాదరణ పొందింది. దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మద్దతున్న ఓపెన్ ఏఐ రూపొందించిన ఈ చాట్‌బాట్ మరింత అందుబాటులోకి రానుంది.
18002428478 నంబరుతో చాట్
అందుబాటులోకి తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ..!
అయితే, ప్రస్తుతానికి అమెరికా, కెనడాల్లోనే
న్యూఢిల్లీ, డిసెంబరు 19: ఇటీవలి కాలంలో చాట్ జీపీటీ విస్తృతంగా ప్రజాదరణ పొందింది. దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మద్దతున్న ఓపెన్ ఏఐ రూపొందించిన ఈ చాట్‌బాట్ మరింత అందుబాటులోకి రానుంది. ఇప్పటిదాక దీనిని వాడాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు మాత్రం వాట్సా్‌పలోనూ చాట్ జీపీటీ సేవలను పొందే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది ఓపెన్ ఏఐ. దీనికోసం ఇతర యాప్, ప్రత్యేక ఖాతా నంబరుతో పనిలేకుండా మనం కోరుకున్న సమాచారాన్ని తెలుసుకునేందుకు 18002428478 నంబరుతో చాట్ చేయొచ్చు కాల్ చేసి కూడా సేవ లు పొందే అవకాశం ఉంది. అయితే, దీనికి నిర్దిష్ట పరిమితి ఉంది. ప్రస్తుతానికి ఈ సౌలభ్యం అమెరికా, కెనడాలకు మాత్రమే పరిమితం. ఇప్పటికే మెటా.. వాట్సా్‌ప లో ఏఐ చాటాబాట్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి పోటీగా ఓపెన్ ఏఐ కూడా రంగంలోకి దిగింది. ఈ ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో.. ‘12 డేస్ ఆఫ్ ఓపెన్ ఏఐ అనౌన్స్‌మెంట్’లో భాగంగా గురువారం చాట్‌జీపీటీ వాట్సాప్ వినియోగాన్ని ప్రకటించింది.
Updated Date - Dec 20 , 2024 | 03:40 AM