ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చుక్కల మందుతో చత్వారానికి చెక్‌

ABN, Publish Date - Sep 04 , 2024 | 04:00 AM

నాలుగు పదుల వయసు దాటగానే కొందరికి చత్వారం (ప్రెస్బియోపియా) వస్తుంది. పుస్తకాలు చదవడానికి కళ్లజోడు అవసరం అవుతుంది.

Eye Drops

‘ప్రెస్‌వూ’ ఐ డ్రాప్స్‌.. ధర రూ.350.. అక్టోబరు నుంచి అందుబాటులోకి

ఒక్క చుక్క వేస్తే 6 గంటలపాటు రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు!


న్యూఢిల్లీ, ముంబై, సెప్టెంబరు 3: నాలుగు పదుల వయసు దాటగానే కొందరికి చత్వారం (ప్రెస్బియోపియా) వస్తుంది. పుస్తకాలు చదవడానికి కళ్లజోడు అవసరం అవుతుంది. కానీ అలాంటివారికి కళ్లజోడు అవసరం లేకుండా చేసే చుక్కల మందు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది. ముంబైకి చెందిన ఎన్‌టాడ్‌ ఫార్మా కంపెనీ ‘ప్రెస్‌వూ’ పేరిట అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందుకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిచ్చింది. అక్టోబరు మొదటివారంలో ఈ మందును మార్కెట్లోకి తెస్తామని ఆ సంస్థ వెల్లడించింది. 40 నుంచి 55 ఏళ్ల వయసువారిలో.. కొద్దిపాటి నుంచి ఒక మోస్తరు చత్వారంతో బాధపడుతున్నవారు ఈ మందును కంట్లో ఒక్క చుక్క వేస్తే 15 నిమిషాల్లోనే పనిచేయడం ప్రారంభిస్తుందని సంస్థ సీఈవో నిఖిల్‌ తెలిపారు. ఒక్క చుక్క వేస్తే ఆరు గంటల దాకా.. రెండు చుక్కలు వేస్తే మరింత ఎక్కువ సమయం పనిచేస్తుందని ఆయన వివరించారు. ఈ చుక్కల మందు ధర రూ.350.


వ్యూటీ పేరుతో డ్రాప్స్

నిజానికి.. అమెరికాలో ‘వ్యూటీ’ పేరుతో 2022లోనే ఈ తరహా ఐడ్రాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ‘ప్రెస్‌వూ’.. మనదేశంలో తయారైన మొట్టమొదటి ప్రెస్బియోపియా చుక్కల మందు కావడం విశేషం. ఈ చుక్కల మందు.. మన కన్నీటి పీహెచ్‌ విలువకు తగినట్టుగా వేగంగా తనను తాను సర్దుబాటు చేసుకుంటుందని, కాబట్టి దీర్ఘకాలంపాటు వాడినా ఈ మందుతో ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవని ఎన్‌టాడ్‌ సీఈవో నిఖిల్‌ వెల్లడించారు. ‘‘ఈ డ్రాప్స్‌ తయారీలో ‘పైరోకార్బన్‌’ మాలిక్యూల్‌ను ఉపయోగించాం. అమెరికాలో సెప్సిస్‌ సమస్యకు దాన్ని చాలాకాలంగా వాడుతున్నారు. వాస్తవానికి దాన్ని రోజూ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మేం దాని గాఢతను బాగా తగ్గించి.. మన కన్నీటి పీహెచ్‌ విలువకు దాదాపు దగ్గరగా తెచ్చాం’’ అని నిఖిల్‌ తెలిపారు. ఈ చుక్కలు వేయగానే.. అందులోని ఔషధం కనుపాపలు కుచించుకుపోయేలా చేస్తుందని, దానివల్ల ‘డెప్త్‌ ఆఫ్‌ ఫీల్డ్‌’ పెరిగి కంటిచూపు నిశితమవుతుందని ఆయన వివరించారు.

Updated Date - Sep 04 , 2024 | 10:20 AM

Advertising
Advertising