ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cheetah: వామ్మో.. చిరుత ప్రైవేటు పాఠశాలలోకి చొరబడిందిగా...

ABN, Publish Date - Jun 15 , 2024 | 12:39 PM

తిరుపత్తూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం చిరుత(Cheetah) ప్రవేశించడం కలకలం రేపింది. కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో మధ్యాహ్నం విద్యార్థులందరూ తరగతి గదుల్లో ఉన్నారు.

- దాడిలో ఒకరికి గాయాలు

చెన్నై: తిరుపత్తూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం చిరుత(Cheetah) ప్రవేశించడం కలకలం రేపింది. కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో మధ్యాహ్నం విద్యార్థులందరూ తరగతి గదుల్లో ఉన్నారు. ఆ సమయంలో పాఠశాల వాహనాలకు గోపాల్‌(Gopal) అనే వ్యక్తి రంగులు వేస్తున్నాడు. ఇంతలో ఊహించని విధంగా పాఠశాల ప్రాంగణంలోకి చొరబడిన చిరుత గోపాల్‌పై దాడి చేసింది. గమనించిన చుట్టుపక్కల వారు వేసిన కేకలతో ఆ చిరుత సమీపంలోని కారు షెడ్‌లోకి వెళ్లింది. పాఠశాలలో చిరుత ప్రవేశించిందన్న సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హూటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే కొందరు యువకులు తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసు, అటవీ, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నారు.

ఇదికూడా చదవండి: Good news: ఉద్యోగులకు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. అదేంటో తెలిస్తే..


అంతలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాల వెలుపలికి రావడంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రాంగణాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరా ఆధారంగా చిరుత కదలికలను అధికారులు పరిశీలించారు. చిరుతకు మత్తు ఇంజక్షన్‌ వేసి బంధించాలని నిర్ణయించిన అధికారులు వెటర్నరీ వైద్యులను రప్పించారు. ఇంజక్షన్‌ వేసేలోపు చిరుత బయటకు వస్తే దానిని బంధించేలా ఆ ప్రాంతంలో వలలు ఏర్పాటుచేశారు. రాత్రి సమయం కావడంతో ఆ ప్రాంతంలో కాంతివంతమైన లైట్లు ఏర్పాటుచేసే పనులను విద్యుత్‌ బోర్డు సిబ్బంది చేపట్టారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 12:39 PM

Advertising
Advertising