ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: నిత్యపెళ్ళి కూతురికి బెయిల్‌ మంజూరు..

ABN, Publish Date - Sep 13 , 2024 | 12:58 PM

పెళ్ళిపేరుతో సుమారు యాభైమందిని మోసగించిన కేసులో అరెస్టయిన ఈరోడ్‌ జిల్లాకు చెందిన యువతి సంధ్యకు మద్రాసు హైకోర్టు(Madras High Court) బెయిలు మంజూరు చేసింది. తిరుప్పూరు జిల్లా తారాపురానికి చెందిన మహేష్‌ అరవింద్‌(Mahesh Aravind) అనే యువకుడు ఆన్‌లైన్‌లో వధువు కోసం అన్వేషిస్తుండగా సంధ్యతో పరిచయం ఏర్పడింది.

చెన్నై: పెళ్ళిపేరుతో సుమారు యాభైమందిని మోసగించిన కేసులో అరెస్టయిన ఈరోడ్‌ జిల్లాకు చెందిన యువతి సంధ్యకు మద్రాసు హైకోర్టు(Madras High Court) బెయిలు మంజూరు చేసింది. తిరుప్పూరు జిల్లా తారాపురానికి చెందిన మహేష్‌ అరవింద్‌(Mahesh Aravind) అనే యువకుడు ఆన్‌లైన్‌లో వధువు కోసం అన్వేషిస్తుండగా సంధ్యతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకున్నారు. సంధ్యకు వివాహ సమయంలో మహేష్‌ అరవింద్‌ కుటుంబీకులు 12 సవర్ల నగలు కానుకగా ఇచ్చారు. కొద్ది రోజులపాటు సవ్యంగా సాగిన వీరి కాపురం ఉన్నట్టుండి మలుపు తిరిగింది. సంధ్య ఫోన్‌లో పలువురు యువకులతో అశ్లీలంగా తీసుకున్న ఫొటోలు కనిపించడంతో మహేష్‌ దిగ్ర్బాంతిచెందాడు. ఆ విషయమై ఇద్దరూ గొడవపడ్డారు.

ఇదికూడా చదవండి: CM Kejrival Bail: సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్


ఆ నేపథ్యంలో ఉన్నట్టుండి సంధ్య ఇంటి నుండి పారిపోవటంతో మహేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుప్పూరు. పోలీసుల విచారణలో సంధ్య పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు సహా సుమారు 50 మందిని పెళ్ళి చేసుకుని నగలు, నగదు దోచుకుని మోసగించినట్లు వెల్లడైంది. సంధ్యను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె బెయిలు కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. అందులో తనను అరెస్టు చేసి రెండు నెలలు గడిచినా పోలీసులు ఇంకా ఛార్జిషీట్‌ దాఖలు చేయలేని, ఈ కారణంగా తనకు బెయిలివ్వాలని కోరింది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి పి. ధనపాల్‌ ఆమెకు బెయిలు మంజూరు చేశారు.


..........................................................

ఈ వార్తను కూడా చదవండి:

..........................................................

Tirupati: దేవర సినిమా చూసి చచ్చిపోతా...

- అమ్మా.. అప్పటిదాకా బతికించండి

- బతికించండంటూ తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు

తిరుపతి: ‘‘నా బిడ్డకి బ్లడ్‌ కేన్సర్‌. జూనియర్‌ ఎన్టీయార్‌కి వీరాభిమాని. రోజు రోజుకీ పరిస్థితి విషమిస్తోంది. ‘అమ్మా దేవర సినిమా చూసి చచ్చిపోతా.. 27వ తేదీ దాకా నన్ను బతికించండి..’ అని వేడుకుంటున్నాడు’’ అంటూ 19 ఏళ్ల కౌశిక్‌ తల్లి సరస్వతి కన్నీరు మున్నీరవుతూ వెల్లడించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తమ బిడ్డ పరిస్థితి గురించి మీడియాకు వివరిస్తూ సాయం చేయండంటూ ఆమె వేడుకున్నారు. టీటీడీ(TTD)లో కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడు కౌశిక్‌ ఇంటర్‌ చదువుతుండగా అనారోగ్యానికి గురయ్యాడు.


బ్లడ్‌ కేన్సర్‌ అని నిర్ధారణ కావడంతో 2022 నుంచీ చికిత్స తీసుకుంటున్నాడు.బోన్‌మారో చేయాలని వైద్యులు చెప్పారు. హైదరాబాద్‌లోని బసవతారకం కాన్సర్‌ ఆసుపత్రి సహా చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌(Hyderabad)ల్లోని ఆసుపత్రులకు తిరిగారు. ప్రస్తుతం బెంగళూరు(Bangalore)లోని కిడ్‌వై హాస్పిటల్లో కౌశిక్‌ చికిత్స పొందుతున్నాడు. బోన్‌ మారో చికిత్సకు దాదాపు రూ.60లక్షలకు పైగానే ఖర్చవుతుందని తెలియడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. రోజు రోజుకూ మరణానికి దగ్గరవుతున్న కొడుకును చూస్తూ వారు దుఃఖిస్తున్నారు. దాతలు ముందుకు వస్తే బిడ్డ బతుకుతాడని ఆశపడుతున్నారు.


వారి వేదన చూసి ‘అమ్మా నేను బతకనని నాకు తెలుసు.. నా కోసం బాధపడకండి.. దేవర సినిమా దాకా బతికించండి చాలు.. నా చివరి కోరిక తీర్చండి’ అంటూ తమను బిడ్డ సముదాయిస్తున్నాడని చెబుతూ, కౌశిక్‌కి ప్రాణదానం చేయండంటూ ఆ తల్లిదండ్రులు చేతులు జోడిస్తున్నారు. 9490829381 నెంబరుకు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా గానీ లేదా కె. సరస్వతి, యూనియన్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నెంబరు 103310100044506, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ యూబీఐఎన్‌0801313కు గాని దాతలు తమ సాయాన్ని అందించవచ్చు.సమాచారం కోసం 79956 65169 నెంబరులో కౌశిక్‌ తల్లిదండ్రులను సంప్రదించవచ్చు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 13 , 2024 | 12:58 PM

Advertising
Advertising