Chennai: మాజీ మంత్రి విజయభాస్కర్ పరార్.. విషయం ఏంటంటే...
ABN, Publish Date - Jun 27 , 2024 | 11:54 AM
భూకబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్(Former minister MR Vijayabhaskar)ను అరెస్టు చేసేందుకు సీబీసీఐడీ(CBCID) అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అజ్ఞాతంలోకి జారుకున్నట్లు తెలిసింది.
- ఉత్తరాదికి సీబీసీఐడీ అధికారులు
చెన్నై: భూకబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్(Former minister MR Vijayabhaskar)ను అరెస్టు చేసేందుకు సీబీసీఐడీ(CBCID) అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అజ్ఞాతంలోకి జారుకున్నట్లు తెలిసింది. దీంతో విజయభాస్కర్ కోసం సీబీసీఐడీ అధికారులు గాలిస్తున్నారు. కరూర్ జిల్లా వాంగల్ కుచ్చిపాళయం ప్రాంతానికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తి స్థానిక అన్నాడీఎంకే నాయకుడు. ఈయన ఒక ఎలక్ట్రానిక్ దుకాణం నడుపుతుండగా అతడితో మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్‌కు లావాదేవీలుండేవి. ఈ విషయంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రకాష్‌కు చెందిన రూ.100 కోట్ల విలువైన భూమిని బలవంతంగా తన పేరుమీద మాజీ మంత్రి రాయించుకున్నట్టు ఆరోపణలున్నాయి.
ఇదికూడా చదవండి: Ministry of Defence: జూలై 23 నుంచి అగ్నివీర్ నియామక ప్రక్రియ
దీనిపై ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరూర్ నగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే, ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అదేసమయంలో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ విజయభాస్కర్ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన కరూర్ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో విజయభాస్కర్‌ను అరెస్టు చేసేందుకు సీబీసీఐడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 27 , 2024 | 11:54 AM