టీనేజీ ముద్దు నేరమేమీ కాదు: మద్రాస్ హైకోర్టు
ABN, Publish Date - Nov 16 , 2024 | 03:35 AM
టీనేజీ దశలోని యువతీయువకులు పరస్పర ఇష్టంతో చేసుకునే కౌగలింతలు, పెట్టుకునే ముద్దులను క్రిమినల్ చర్యలుగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది.
చెన్నై, నవంబరు 15: టీనేజీ దశలోని యువతీయువకులు పరస్పర ఇష్టంతో చేసుకునే కౌగలింతలు, పెట్టుకునే ముద్దులను క్రిమినల్ చర్యలుగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. యవ్వన ఆకర్షణతో తప్ప, క్రిమినల్ దురుద్దేశాలు లేకుండా చేసే ఇలాంటి పనులకు క్రిమినల్ నేరం కింద సెక్షన్లు మోపలేమని తెలిపింది. 19 ఏళ్ల యువతి, టీనేజీలోని మరో యువకుడు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏకాంత ప్రదేశంలో తనను ముద్దు పెట్టుకోవడంతో పాటు, హత్తుకున్నట్టు తెలిపింది. లైంగిక వాంఛతో దగ్గరకు వచ్చాడన్న నేరంపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 354-ఏ(1)(1) కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Updated Date - Nov 16 , 2024 | 03:35 AM