ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: నేనే దేవుణ్ణి... అభిషేకాలు చేయండి!

ABN, Publish Date - Jul 07 , 2024 | 12:45 PM

ఈరోడ్‌ జిల్లా(Erode District) అందియూరు సమీపం నగలూరులో ఓ ఆలయానికి స్థలమిచ్చిన వ్యక్తి తానే భగవంతుడినని ప్రకటించుకుని తనకు క్షీరాభిషేకాలు చేయమంటూ ఒత్తిడి చేస్తున్న సంఘటన కలకలం సృష్టించింది.

- విగ్రహంపై కూర్చుని ఆలయ స్థలదాత వింత ప్రవర్తన

- అవాక్కైన భక్తులు

చెన్నై: ఈరోడ్‌ జిల్లా(Erode District) అందియూరు సమీపం నగలూరులో ఓ ఆలయానికి స్థలమిచ్చిన వ్యక్తి తానే భగవంతుడినని ప్రకటించుకుని తనకు క్షీరాభిషేకాలు చేయమంటూ ఒత్తిడి చేస్తున్న సంఘటన కలకలం సృష్టించింది. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి శయనభంగిమలో ఉన్న మూలవిరాట్టు రంగనాథస్వామిపై కూర్చుని పూజారి చేత క్షీరాభిషేకం కూడా చేసుకున్నాడు. నగలూరులో కలియుగ రంగనాథర్‌ ఆలయం ఉంది. ఆ ఆలయం కోసలరామన్‌ అనే వ్యక్తికి చెందిన స్థలంలో నిర్మితమైంది. నగలూరు, పరిసర గ్రామాలకు చెందిన భక్తులంతా ఈ ఆలయాన్ని దర్శిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Golconda Bonalu: హైదరాబాద్‌లో బోనాల సందడి..


అమావాస్య రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యలో ఆ ఆలయ స్థల దాత కోసల రామన్‌ ఉన్నట్టుండి తానే రంగనాథస్వామి తానేనని చెప్పుకుంటూ గర్భాలయంలోని స్వామి విగ్రహంపై కూర్చుని తనకు అభిషేకాలు చేయమంటూ అడగటంతో భక్తులందరూ అవాక్కయ్యారు. ఇదిలా ఉండగా మూలవిరాట్టుపై కూర్చుని ఉన్న కోసలరామన్‌కు ఆ ఆలయ పూజారి క్షీరాభిషేకం చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై భక్తులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 07 , 2024 | 12:45 PM

Advertising
Advertising
<