ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: మాజీ సీఎం మిత్రుడికి ఐటీ షాక్‌.. రూ.42 కోట్ల నగదు స్వాధీనం

ABN, Publish Date - Oct 29 , 2024 | 11:26 AM

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) స్నేహితుడికి ఐటీ షాక్‌ ఇచ్చింది. ఈపీఎస్‌ మిత్రుడు ఇలంగోవన్‌ వియ్యంకుడు బాలసుబ్రమణ్యం అనే వ్యాపారి నివాసంలో రూ.42 కోట్ల మేర నగదును ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

- ఈపీఎస్‌ స్నేహితుడు ఇలంగోవన్‌ వియ్యంకుడి ఇంటిలో రూ.42 కోట్ల నగదు స్వాధీనం

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) స్నేహితుడికి ఐటీ షాక్‌ ఇచ్చింది. ఈపీఎస్‌ మిత్రుడు ఇలంగోవన్‌ వియ్యంకుడు బాలసుబ్రమణ్యం అనే వ్యాపారి నివాసంలో రూ.42 కోట్ల మేర నగదును ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈయన తన వ్యాపార కంపెనీలకు సంబంధించి రూ.100 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు వచ్చిన తర్వాత అన్నాడీఎంకే నేతల గృహాల్లో ఈడీ, ఐటీ సోదాలు జరుగుతాయని ప్రతి ఒక్కరూ ఊహించారు.

ఈ వార్తను కూడా చదవండి: Kerala: కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు


అందరూ అనుకున్నట్టుగానే గుట్కా కేసులో మాజీ మంత్రి విజయభాస్కర్‌పై చార్జిషీటు దాఖలు చేసేందుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) అనుమతిచ్చారు. అదేవిధంగా పలువురు మాజీ మంత్రులపై కేసు నమోదుకు కూడా గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామికి సన్నిహితుడైన ఇళంగోవన్‌ వియ్యంకుడు బాలసుబ్రమణ్యం అనే వ్యాపారవేత్త కోయంబత్తూరులో నివశిస్తున్నారు. ఈయనకు అశ్విని పేపర్‌ మిల్స్‌తో పాటు పలు వ్యాపారాలున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన 15 మంది ఐటీ అధికారులు బాలసుబ్రమణ్యంకు చెందిన కంపెనీలు, పేపర్‌ మిల్స్‌లో తనిఖీలు ప్రారంభించి ఆదివారం సాయంత్రంతో పూర్తిచేశారు.


అయితే, ఈ తనిఖీల సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు ఎంతో గోప్యంగా ఉంచారు. సోమవారం ఈ తనిఖీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 22వ తేదీ నుంచి నిర్వహించిన తనిఖీల్లో రూ.100 కోట్ల మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు తేల్చారు. అలాగే, బాలసుబ్రమణ్యంకు నివాసంలో రూ.42 కోట్ల మేర నగదు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. ఈ సోదాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఇదిలావుంటే, మున్ముందు కూడా అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రుల నివాసాల్లో ఈడీ, ఐటీ సోదాలు కొనసాగవచ్చని భావిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Food Poisoning: వామ్మో.. మోమోస్‌!

ఈవార్తను కూడా చదవండి: KTR: బుచ్చమ్మది.. రేవంత్‌ చేసిన హత్య

ఈవార్తను కూడా చదవండి: Madhuranagar: ‘ధరణి’తో మా ప్లాట్ల కబ్జా

ఈవార్తను కూడా చదవండి: Kaleshwaram Project: మేడిగడ్డతో ముంపు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 29 , 2024 | 11:26 AM