Chennai: ఊటీ రైలు పట్టాలపై మట్టిచరియలు, బండరాళ్లు
ABN, Publish Date - Oct 17 , 2024 | 12:27 PM
కున్నూరు - ఊటీ(Kunnur - Ooty) మధ్య పలు చోట్ల రైలు పట్టాలపై మట్టి చరియలు, బండరాళ్లు పడటంతో కొండ రైలు సర్వీసును తాత్కాలికంగా రద్దు చేశారు. నీలగిరి జిల్లా కున్నూరు పరిసర ప్రాంతాల్లో వారం రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.
చెన్నై: కున్నూరు - ఊటీ(Kunnur - Ooty) మధ్య పలు చోట్ల రైలు పట్టాలపై మట్టి చరియలు, బండరాళ్లు పడటంతో కొండ రైలు సర్వీసును తాత్కాలికంగా రద్దు చేశారు. నీలగిరి జిల్లా కున్నూరు పరిసర ప్రాంతాల్లో వారం రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మేట్టుపాళయం(Mettupalayam) నుంచి కున్నూరు దాకా నడిపే కొండ రైలు సర్వీసును బుధ, గురువారాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే సమయంలో కున్నూరు - ఊటీ మధ్య కొండ రైలు నడుపుతామన్నారు. అయితే మంగళవారం రాత్రి కురిసిన కుండ పోత వర్షాలకు ఆ మార్గంలోని మూడు చోట్ల పట్టాలపై మట్టి చరియలు, బండరాళ్లు కూలిపడ్డాయి. దీంతో కున్నూరు నుంచి ఊటీ వెళ్లే కొండరైలు సర్వీసును రద్దు చేశారు. ప్రస్తుతం ఆ మార్గంలో పట్టాలపై పడిన మట్టి చరియలు, బండరాళ్లను రైల్వే సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయిన తరువాత కొండ రైలు నడుపుతామని అధికారులు ప్రకటించారు.
ఈ వార్తను కూడా చదవండి: Next CJI: తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..
తాత్కాలిక జలపాతాలు..
ఊటీ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కొండ రైలు మార్గంలోని పలు ప్రాంతాల్లో తాత్కాలిక జలపాతాలు ఏర్పడ్డాయి. ఉడ్‌బ్రిడ్జి, పర్లియారు, కేఎన్‌ఆర్ హిల్‌గ్రోవ్, అటర్లీ తదితర ప్రాంతాల్లో కొండపై పలు చోట్ల నీరు ఉదృతంగా పట్టాలపై పడుతోంది. అదే సమయంలో ఆ నీటి ఉదృతికి మట్టిపెళ్లలు జారి పట్టాలపై పడుతున్నాయి. ప్రస్తుతం ఈ జలపాతాల వలన కొండ రైలు మార్గం తీవ్రంగా దెబ్బతింటుందేమోనని రైల్వే అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
ఇక పెనుగాలులతో కూడిన వర్షాల కారణంగా వండిచోలై, పౌలాడి మఠం, బాయిస్ కంపెనీ, మూండ్రురోడ్డు తదితర ప్రాంతాల్లో చెట్లు కూల్డాయి. అగ్నిమాపక అధికారి కుమార్, తహసీల్దార్ కని సుందరం పర్యవేక్షణలో కార్మికులు ఆ చెట్లను తొలగిస్తున్నారు. బుధవారం ఉదయం కున్నూరు సమీపంలోని బ్లాక్‌బ్రిడ్జి - సప్లయిడిపో రహదారిలో మూడు చెట్లు విద్యుత్ తీగెలపై పడ్డాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు వెంటనే ఆ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
...................................................................
ఈ వార్తను కూడా చదవండి:
..................................................................
Chennai: కుమరిలో ‘అల’జడి.. ఇళ్లలోకి చొరబడిన సముద్ర జలాలు
చెన్నై: కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లాలో మంగళవారం రాత్రి సముద్రతీర ప్రాంతాల్లో రాక్షస అలలు ఎగసిపడ్డాయి. పది నుండి 15 అడుగుల ఎత్తున అలలు దూసుకురావటంతో తీర ప్రాంతాల్లోని నివాసాల్లో సముద్రపు నీరు వరదలా ప్రవేశించింది. పలువురు తమ ఇళ్లలోకి సముద్రపు నీరు రాకుండా ఇసుక బస్తాలు పేర్చి రాత్రంతా జాగారం చేశారు. రాజమంగళం సమీపం ఆళిక్కాల్, పిళ్లైతోప్పు ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి నుండి బుదవారం వేకువజాము వరకు అలలు జనావాస ప్రాంతాల వైపు ఎగసిపడ్డాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 150కి పైగా ఇళ్లలోకి సముద్ర జలాలు చొరబడ్డాయి.
దీంతో ఆ ఇళ్లలో నివసిస్తున్నవారిని రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలువురు తమ ఇళ్ల మిద్దెలపై పడుకున్నారు. జాలర్ల కుప్పాలలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఇదే విధంగా తేంగాయ్‌పట్టినం, ఇరవిబుధన్ తురై, వళ్లవిలై, పూత్తురై, తూత్తురై ప్రాంతాల్లోనూ అలలు 15 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతాల్లోని ఇళ్లన్నీ కోతకు గురయ్యాయి. అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో బుధవారం ఉదయం కన్నియాకుమారి త్రివేణి సంగమం, ముట్టమ్ ప్రాంతాలకు పర్యాటకులను అనుమతించకుండా అధికారులు నిషేధం విధించారు. ఇదే విధంగా జాలర్లు రెండు రోజులపాటు చేపల వేటకు వెళ్లొద్దని కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదికూడా చదవండి: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...
ఇదికూడా చదవండి: హైడ్రాకు జీహెచ్‌ఎంసీ, మునిసిపల్ అధికారాల బదిలీ
ఇదికూడా చదవండి: Revenue System: మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ!
ఇదికూడా చదవండి: బతుకమ్మరోజు ఆడబిడ్డలకు ఒక్కచీరా ఇవ్వలేదు
Read Latest Telangana News and National News
Updated Date - Oct 17 , 2024 | 12:27 PM