ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: రేషన్‌ దుకాణాల్లో మద్యం, కల్లు.. హైకోర్టులో పిటిషన్‌

ABN, Publish Date - Jul 31 , 2024 | 01:30 PM

కల్లు విక్రయాలపై విధించిన నిషేధం ఎత్తివేయడంతో పాటు, సూపర్‌ మార్కెట్లు, రేషన్‌ దుకాణాల్లో(Supermarkets, ration shops) మద్యం విక్రయాలు చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అభిప్రాయం చెప్పాలని మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

- ప్రభుత్వ వివరణ కోరిన ధర్మాసనం

చెన్నై: కల్లు విక్రయాలపై విధించిన నిషేధం ఎత్తివేయడంతో పాటు, సూపర్‌ మార్కెట్లు, రేషన్‌ దుకాణాల్లో(Supermarkets, ration shops) మద్యం విక్రయాలు చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అభిప్రాయం చెప్పాలని మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక కొరట్టూరుకు చెందిన మురళీధరన్‌ హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో... 2003 నుంచి టాస్మాక్‌ ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, చిల్లర విక్రయాల్లో అదనంగా డబ్బులు వసూలు చేస్తుండడంతో, సుమారు రూ.1,000 కోట్లకు పైగా అవినీతి జరుగుతోందన్నారు.

ఇదికూడా చదవండి: AAP Govt : ఢిల్లీలో కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు చట్టం..!


ఈ నగదు సేల్స్‌మెన్‌ నుంచి ఆ శాఖ మంత్రి వరకు వాటాలు అందుతున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. ప్రధానమైన మద్యం తయారీ కంపెనీలు అధికార, ప్రతిపక్ష నాయకులకు చెందినవని, అందువల్ల నిర్దేశిత బ్రాండ్‌ మద్యం విక్రయాలు మాత్రమే అధికంగా జరుగుతున్నాయన్నారు. మద్యం కంటే కల్లులో ఆల్కహాల్‌ శాతం తక్కువగా ఉందని, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి(Kerala, Andhra Pradesh, Karnataka, Puducherry) తదితర రాష్ట్రాల్లో కల్లు విక్రయాలు జరుగుతున్నాయన్నారు.


ఆరోగ్యం ప్రామాణికంగా తీసుకొని రాష్ట్రంలో కల్లు విక్రయాలపై విధించిన నిషేధం ఎత్తివేయాలని, సూపర్‌ మార్కెట్లలో అన్నిరకాల మద్యపానీయాలు, రేషన్‌ దుకాణాల్లో తక్కువ ధరకు మద్యం, కల్లు విక్రయాలు చేపట్టేలా ఉత్తర్వులు జారీచేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణన్‌కుమార్‌, న్యాయమూర్తి జస్టిస్‌ కుమరేష్‌ బాబుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయంపై అభిప్రాయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 8 వారాలకు వాయిదావేసింది.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2024 | 01:30 PM

Advertising
Advertising
<