ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chennai: కన్నియాకుమారిలో మూడో రోజూ ‘అల’ జడి

ABN, Publish Date - May 08 , 2024 | 12:19 PM

కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లా అంతటా మూడో రోజూ సముద్రతీర ప్రాంతాల్లో రాక్షస అలలు ఎగసిపడ్డాయి. పదడుగుల నుంచి 15 అడుగుల ఎత్తుకు అలలు తీరం వైపు దూసుకువచ్చాయి.

- సముద్రతీర ప్రాంతాల్లో నిఘా

చెన్నై: కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లా అంతటా మూడో రోజూ సముద్రతీర ప్రాంతాల్లో రాక్షస అలలు ఎగసిపడ్డాయి. పదడుగుల నుంచి 15 అడుగుల ఎత్తుకు అలలు తీరం వైపు దూసుకువచ్చాయి. ఐదుగురు మెడికోల దుర్మరణానికి కారణమైన లేమూర్‌ సముద్రతీరంలో పర్యాటకులు ఎవరూ వెళ్ళకుండా అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించినట్లుగానే కన్నియాకుమారి త్రివేణి సంగమం, లేమూరు సముద్రతీర ప్రాంతాల్లో అలల తాకిడి అధికంగా కనిపించింది.

ఇదికూడా చదవండి: The Wire: గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్‌

బుధవారం ఉదయం సముద్రతీరం వైపు పర్యాటకులను వెళ్ళకుండా అధికారులు కట్టుదిట్టం చేశారు. దీంతో సముద్రతీర ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రస్తుతం పర్యాటకులు అధికంగా సంచరించే తీర ప్రాంతాల్లో పోలీసులు నిఘా వేస్తున్నారు. బుధవారం ఉదయం లేమూరు తీరాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులను పోలీసులు వెనక్కి పంపారు. సొత్తవినై, చిన్న ముట్టమ్‌, పెరియముట్టమ్‌ తీర ప్రాంతాల్లోనూ పర్యాటకుల రాకపోకలపై పోలీసులు నిఘా వేశారు.

ఇదికూడా చదవండి: Bengaluru: ప్రజ్వల్‌పై బ్లూకార్నర్‌ నోటీసు

Updated Date - May 08 , 2024 | 12:19 PM

Advertising
Advertising