Chennai: చెన్నైలోని 776 ప్రాంతాల్లో ‘రోడ్‌సైడ్ ఫుడ్ సెంటర్లు’
ABN, Publish Date - Aug 07 , 2024 | 12:53 PM
నగరంలో రోడ్‌సైడ్ తోపుడుబళ్ల కారణంగా సంభవిస్తున్న ట్రాఫిక్ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు కార్పొరేషన్(Corporation) సిద్ధమైంది. అంతేగాక అపరిశుభ్రంగా తయారు చేసి విక్రయిస్తున్న ఆహార పదార్థాలతో తలెత్తుతున్న విపత్కర పరిణాలను కూడా అడ్డుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది.
- 35 వేల మంది వ్యాపారులకు అనుమతి
చెన్నై: నగరంలో రోడ్‌సైడ్ తోపుడుబళ్ల కారణంగా సంభవిస్తున్న ట్రాఫిక్ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు కార్పొరేషన్(Corporation) సిద్ధమైంది. అంతేగాక అపరిశుభ్రంగా తయారు చేసి విక్రయిస్తున్న ఆహార పదార్థాలతో తలెత్తుతున్న విపత్కర పరిణాలను కూడా అడ్డుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఒకే సారి ఈ రెండింటికీ చెక్ పెట్టేందుకు అనువుగా నగర వ్యాప్తంగా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేని 776 ప్రాంతాల్లో ‘రోడ్‌సైడ్ ఫుడ్ సెంటర్లు’(Roadside Food Centres) ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. తద్వారా 35 వేల మంది వ్యాపారులకు లబ్ది చేకూరడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహారం లభించేందుకు మార్గం సుగమమవుతుంది.
ఇదికూడా చదవండి: Rains: 9 జిల్లాల్లో నేడు, రేపు వానలు..
చెన్నైలో జనసంచారం అధికంగా వుండే ప్రాంతాల్లో చిన్నతరహా తోపుడు బళ్లు పెరుగుతున్నాయి. దీని వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుండడంతో పాటు శుభ్రంగా లేని ఆహారం విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై చెన్నై కార్పొరేషన్ కమిషనర్ కుమరగురుబన్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు, వ్యాపార సంఘాల నేతలు కూలంకషంగా చర్చించారు. చెన్నై నగరంలో ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేయడంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ చర్చల్లో వచ్చిన సలహాలు, సూచనల మేరకు మండలాలవారీగా రోడ్‌సైడ్ ఫుడ్ సెంటర్లు పెట్టుకునేందుకు అనుమతిచ్చారు.
ఆ మేరకు ఉత్తర మండలంలో తాళంగుప్పం మార్కెట్, మనలి పుదునగర్‌లో 80 అడుగుల రోడ్డు, టీహెచ్ రోడ్డు మార్కెట్, ఎంజీ రోడ్డులో వుండే షాపింగ్ కాంప్లెక్స్, సెంట్రల్ చెన్నై(Central Chennai)లో అంగాళమ్మన్ వీధి, చిన్నబాబు వీధి, కీల్పాక్ గార్డెన్ వీధి, ఆమ్స్ రోడ్డు, పురుషవాక్కం హైరోడ్డు, దక్షిణమండలంలో రంగనాధన్ వీధి, వెంకటనారాయణరోడ్డు, పీవీ రాజమన్నార్‌రోడ్డు, జీఎన్ చెట్టి రోడ్డు, ఎల్‌బీ రోడ్డు, బీసెంత్ అవెన్యూ తదితర 776 చోట్ల రోడ్‌సైడ్ ఫుడ్ సెంటర్లు పెట్టుకునేందుకు అనుమతివ్వాలని నిర్ణయించారు. అయితే అనుమతించబడిన ప్రాంతాల్లో ఫుడ్‌సెంటర్లు పెట్టుకునేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సివుంటుంది. నాణ్యమైన ఆహారం ఇవ్వడంపై సర్టిఫికెట్ పొందాలి. అదే విధంగా ఒకేవిధమైన మోడల్లో అంగళ్లు వుండాలని అధికారులు షరతులు విధించారు. రోడ్‌సైడ్ ఫుడ్‌కోర్టు పెట్టుకునేందుకు 35,588 మంది వ్యాపారులకు అనుమతిచ్చారు.
నిబంధనలు అతిక్రమిస్తే శిక్షే...
ఉత్తర మండలంలో జనాభా ఎక్కువగా వుండే మూలచక్రం మెయిన్‌రోడ్డు, ప్రకాశం రోడ్డు, ఇళయరోడ్డు, మధ్యమండలంలో కొళత్తూర్ మెయిన్‌రోడ్డు, తిరుమంగళం రోడ్డు, న్యూ ఆవడి రోడ్డు, హండ్రెడ్‌మీటర్స్ రోడ్డు, ఈవీఆర్ పెరియార్ హైరోడ్డు, దక్షిణమండళంలో జోన్స్ రోడ్డు, గంగాధరన్ వీధి, ఆసుపత్రి రోడ్డు, లేబర్ కాలనీ తదితర 491 చోట్ల ఫుడ్ సెంటర్లు పెట్టుకునేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేకండా ఫుడ్‌కోర్టు పెడితే వాటిని తొలగించడంతో పాటు యజమానులకు జరిమానా కూడా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి
ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?
ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!
Updated Date - Aug 07 , 2024 | 12:53 PM