Chennai: సనాతనం వేరు.. దేవుడిపై నమ్మకం వేరు
ABN, Publish Date - Nov 23 , 2024 | 11:54 AM
సనాతనం వేరు, దేవుడిపై నమ్మకం వేరని, దేవుడిపైన, మతంపైన విశ్వాసం సామాన్య ప్రజానీకం భావాలని, వాటిని గౌరవించడమే తమ ధ్యేయమని డీపీఐ నేత తొల్ తిరుమావళవన్(Thol Thirumavalavan) స్పష్టం చేశారు. ఇటీవల ఆయన పళని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంపై మీనంబాక్కం విమానాశ్రయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు.
- డీపీఐ అధినేత తిరుమావళవన్
చెన్నై: సనాతనం వేరు, దేవుడిపై నమ్మకం వేరని, దేవుడిపైన, మతంపైన విశ్వాసం సామాన్య ప్రజానీకం భావాలని, వాటిని గౌరవించడమే తమ ధ్యేయమని డీపీఐ నేత తొల్ తిరుమావళవన్(Thol Thirumavalavan) స్పష్టం చేశారు. ఇటీవల ఆయన పళని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంపై శుక్రవారం మీనంబాక్కం విమానాశ్రయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆలయాలు, మసీదులు సందర్శించమని కోరితే తాను వెళ్తుంటానని చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: Elections: కేకేనే మళ్లీ హీరో.. మహారాష్ట్ర సర్వేలో సత్తా చాటిన తెలుగోడు..
ఇదే విధంగా పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలు ఆహ్వానించినా ఆలయాలకు వెళ్ళి వస్తుంటానని, అవన్నీ ప్రజలభావాలను గౌరవించడమే అవుతుందన్నారు. అందువల్ల ప్రత్యర్థుల విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సనాతనంలో విమర్శనాత్మక చర్యలనే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ రీతిలోనే తాను పార్టీ విషయమై పళనికి వెళ్ళినప్పుడు కార్యకర్తల ఆహ్వానం మేరకే 30 యేళ్ల తర్వాత ఆ ఆలయానికి వెళ్లి, స్వామివారికి పూజలు కూడా చేశానని, ఇందులో ఎలాంటి వైరుధ్యాలకు తావులేదని స్పష్టం చేశారు.
అంబేడ్కర్ పుస్తకావిష్కరణకు దూరం..
నగరంలో డిసెంబర్ 6న జరిగే అంబేడ్కర్ పుస్తకావిష్కరణ సభలో డీపీఐ నేత తొల్ తిరుమావళవన్ పాల్గొనబోరని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ పుస్తకావిష్కరణ సభలో టీవీకే నేత విజయ్, డీపీఐ నేత తిరుమా పాల్గొంటారని ప్రసార మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. పుస్తకావిష్కరణ సభ రాజకీయ వేదికగా మారే అవకాశం ఉన్నందున తిరుమా ఆ సభలో పాల్గొనరని పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈవార్తను కూడా చదవండి: Sarpanch: కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది!
ఈవార్తను కూడా చదవండి: వామ్మో...చలి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 23 , 2024 | 11:54 AM