ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: పురావస్తు పరిశోధనలో బయల్పడిన రాతియుగం నాటి పనిముట్లు

ABN, Publish Date - Aug 13 , 2024 | 12:57 PM

కోయంబత్తూర్‌ జిల్లా మోలపాళయం ప్రాంతంలో తమిళ విశ్వవిద్యాలయం(Tamil University) నిర్వహించిన పురావస్తు పరిశోధనల్లో కొత్త రాతియుగం పనిముట్లు లభ్యమయ్యాయి. ఈ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ సెల్వకుమార్‌ నేతృత్వంలో మోలపాళయంలో 2021లో పురావస్తు పరిశోధనలు జరిగాయి.

చెన్నై: కోయంబత్తూర్‌ జిల్లా మోలపాళయం ప్రాంతంలో తమిళ విశ్వవిద్యాలయం(Tamil University) నిర్వహించిన పురావస్తు పరిశోధనల్లో కొత్త రాతియుగం పనిముట్లు లభ్యమయ్యాయి. ఈ విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ సెల్వకుమార్‌ నేతృత్వంలో మోలపాళయంలో 2021లో పురావస్తు పరిశోధనలు జరిగాయి. ఈ విషయమై సెల్వకుమార్‌ మాట్లాడుతూ... నడి వయస్సు మహిళ, 3 నుంచి 7 ఏళ్లలోపున్న పిల్లల అస్తిపంజరాలు, పశువులు, మేకల అస్తిపంజరాలు, రోళ్లు, రోకళ్లు, ధాన్యం విత్తనాలు, రాతి గొడ్డళ్లు, కొత్త రాతియుగం నాటి కుండలు, సముద్రపు శంఖాలతో చేసిన దండలు, ధాన్యం సేకరణ పాత్రలు వంటివి కనుగొన్నామన్నారు.

ఇదికూడా చదవండి: Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు


ఈ ప్రాంతంలో లభించిన మాంసపు ముక్కను అమెరికాలో ఉన్న బీటా ల్యాబ్‌కు పంపించి కాలాన్ని నిర్ధారించగా, 3,200 నుంచి 3,600 ఏళ్ల క్రితం జీవించిన మనుషులు ఆహారానికి వినియోగించిన ఎండు మాంసంగా గుర్తించారన్నారు. జూన్‌లో చేపట్టిన పరిశోధనల్లో భూమిలో 80 నుంచి 140 సెం.మీ అడుగున కొత్త రాతియుగం నాటి పనిముట్లు లభించాయన్నారు. వీటితో పాటు మూడు సానపట్టిన రాతి గొడ్డళ్లు లభించాయని, మృతదేహాలను భద్రపరిచే శవపేటికలు కూడా కనుగొన్నామని తెలిపారు. ప్రస్తుతం లభ్యమైన వస్తువులను ప్రయోగశాలకు పంపించి వాటి కాలాలు నిర్ధారించనున్నామని తెలిపారు.


.....................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.......................................................................

Chennai: 18న కరుణ సెంటినరీ స్మారక రూ.100 నాణేం విడుదల..

చెన్నై: దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) శతజయంతి వార్షికోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఆయన రూపంతో రూ.100 నాణెం ముద్రించింది. ఈ నెల 18వ తేది సాయంత్రం 6.50 గంటలకు స్థానిక ఓమందూర్‌ ప్రభుత్వ ఎస్టేట్‌ ప్రాంగణంలో ఉన్న కలైవానర్‌ ఆరంగంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) అధ్యక్షతన నాణెం విడుదల కార్యక్రమం జరుగనుంది.


ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌(Union Home Minister Rajnath Singh) పాల్గొని ‘ముత్తమిళ్‌ అరింజర్‌, కలైంజర్‌ శత స్మారక రూ.100 నాణెం’ విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, తమిళ సినిమా అగ్రహీరోలు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ తదితర ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. అదే విధంగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని సచివాలయం ప్రకటించింది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 13 , 2024 | 12:57 PM

Advertising
Advertising
<