ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: రాత్రి వేళల్లో ఇళ్లపై రాళ్లు.. ఆందోళనలో గ్రామస్తులు

ABN, Publish Date - Jul 10 , 2024 | 11:34 AM

తిరుప్పూర్‌ సమీపంలో ఇళ్లపై పడుతున్న రాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గ్రామంలో విద్యుద్దీపాలు, డ్రోన్‌ కెమెరాలు(Drone cameras), క్రేన్లు తదితరాలతో గ్రామస్తుల సాయంతో ఈ మిస్టరీ ఛేధించేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.

చెన్నై: తిరుప్పూర్‌ సమీపంలో ఇళ్లపై పడుతున్న రాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గ్రామంలో విద్యుద్దీపాలు, డ్రోన్‌ కెమెరాలు(Drone cameras), క్రేన్లు తదితరాలతో గ్రామస్తుల సాయంతో ఈ మిస్టరీ ఛేధించేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. తిరుప్పూర్‌ జిల్లా కాంగేయం సమీపం ఒట్టపాళయం గ్రామంలో 12 రోజులుగా రాత్రి వేళల్లో ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి. రాళ్లు పడడంతో పలు ఇంటిపై ఉన్న రేకులు ధ్వంసమవుతున్నాయి. ఒకటి, రెండు రోజులు ఎవరో ఆకతాయిలు ఈ పని చేస్తున్నారని గ్రామస్తులు భావించగా, రాళ్లు పడడం కొనసాగుడడంతో వారు భయభ్రాంతులు చెందుతున్నారు. గ్రామంలోని యువకులు బృందంగా ఏర్పడి రాత్రి వేళ గ్రామం, పరిసరాల్లో గస్తీ తిరిగినా రాళ్లు పడడం ఆగడం లేదు.

ఇదికూడా చదవండి: IPS officers: 18 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ..


సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామమంతా విద్యుద్దీపాలు, డ్రోన్‌ కెమెరాలు, క్రేన్లు ఏర్పాటుచేసి నిఘా ఏర్పాటుచేశారు. రాత్రి వేళల్లో డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. కాంగేయం తహసీల్దార్‌ మయిల్‌స్వామి స్వయంగా గ్రామాన్ని పరిశీలించారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, రాళ్లు వేస్తున్న అగంతకులను త్వరలోనే పట్టుకుంటామని తహసీల్దార్‌ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. అయినా అధికారులు, పోలీసుల మాటలు నమ్మని గ్రామస్తులు, రాత్రి వేళ ఇంటికి తాళాలు వేసి కరుప్పరాయన్‌ ఆలయంలో తలదాచుకుంటున్నారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 11:34 AM

Advertising
Advertising
<