ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

One Nation One Election: జమిలి ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యం.. చిదంబరం కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Sep 16 , 2024 | 06:57 PM

ప్రస్తుత రాజ్యాంగ ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం ఐదు సవరణలైనా చేయాల్సి ఉంటుందని పి.చిదంబరం అన్నారు. రాజ్యాంగ సవరణలను లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టేందుకు తగినంత సంఖ్యాబలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద లేదని అన్నారు.

న్యూఢిల్లీ: మూడోసారి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే 'జమిలి' ఎన్నికలు మొదలవుతాయంటూ జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం (P Chidambaram) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో 'ఒకే దేశం ఒకే ఎన్నికల' (One Nation One Election) అమలు అసాధ్యమని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


ప్రస్తుత రాజ్యాంగ ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం ఐదు సవరణలైనా చేయాల్సి ఉంటుందని చిదంబరం అన్నారు. రాజ్యాంగ సవరణలను లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టేందుకు తగినంత సంఖ్యాబలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద లేదని అన్నారు. 'ఒకే దేశం ఒకే ఎన్నికలు' ప్రతిపాదనను ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు.


'ఒకే దేశం ఒకే ఎన్నికలు' ప్రతిపాదన బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కీలకంగా ఉంది. గత నెల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ప్రధానమంత్రి మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తరచు జరిగే ఎన్నికలు దేశ ప్రగతికి అవరోధమవుతాయని అన్నారు. జమిలి ఎన్నికలు ఇప్పటి అవసరమని స్పష్టం చేశారు.


For MoreNational NewsandTelugu News

Also Read:Uttar Pradesh: భారీ వర్షాలతో యూపీ అతలాకుతలం : 14 మంది మృతి

Also Read:Uttar Pradesh: మళ్లీ తోడేలు దాడి: బాధిత కుటుంబాలతో సీఎం యోగి భేటీ

Updated Date - Sep 16 , 2024 | 06:57 PM

Advertising
Advertising