ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స్.. 40 ఏళ్లకిందటే మంత్రిగా పనిచేశా

ABN, Publish Date - Nov 06 , 2024 | 01:38 PM

నలభై ఏళ్లకిందటే మంత్రిని అయ్యాను, సంపాదనే లక్ష్యమైతే ఎంతో సంపాధించేవాన్ని కానీ నిజాయితీ, నైతికతను నమ్మాను, అటువంటిది 14 ఇంటి స్థలాలకోసం తప్పు చేస్తానా..? అంటూ సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ప్రశ్నించారు.

- నీతి తప్పి ఉంటే ఎంతో సంపాదించవచ్చు

- 14 ఇంటి స్థలాల కోసం తప్పు చేస్తానా: సీఎం సిద్దరామయ్య

బెంగళూరు: నలభై ఏళ్లకిందటే మంత్రిని అయ్యాను, సంపాదనే లక్ష్యమైతే ఎంతో సంపాధించేవాన్ని కానీ నిజాయితీ, నైతికతను నమ్మాను, అటువంటిది 14 ఇంటి స్థలాలకోసం తప్పు చేస్తానా..? అంటూ సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ప్రశ్నించారు. మంగళవారం శిగ్గావి నియోజకవర్గ పరిధిలోని చందాపుర బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ 40ఏళ్లుగా రాజకీయాల్లో కాదు మంత్రి పదవితోపాటు ఎన్నో కీలకమైన హోదాలలో కొనసాగాను.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: నటి కస్తూరిపై ఎంపీ రాజా ఆగ్రహం.. ద్రావిడ పాలనలో ఆర్య ఆధిక్యాన్ని సహించం


ఆరున్నరేళ్లుపాటు ముఖ్యమంత్రిగా ఉన్నా... అటువంటిది 14 ఇంటిస్థలాలకోసం తప్పు చేస్తానా..? ఎవరైనా నమ్ముతారా..? అంటూ ప్రశ్నించారు. తప్పు చేయకున్నా, తప్పుడు ఆరోపణలతో తనపై కుట్ర పన్నారన్నారు. ప్రజలు ఇటువంటివాటికి అవకాశం ఇవ్వరన్నారు. యడియూరప్పను రాజకీయంగా ముగించేందుకు బసవరాజ్‌ బొమ్మై(Basavaraj Bommai) ప్లాన్‌ చేశారని, యడియూరప్పతో కలసి ఉంటూనే కోలుకోలేని రాజకీయం చేశారన్నారు.


ప్రధాని నరేంద్రమోదీ అబద్ధాల కోరు అని, ఒకప్పుడు కుమారస్వామి వ్యాఖ్యానించారని, రెండోసారి మోదీ ప్రధాని అయితే దేశం వీడుతానని దేవెగౌడ ప్రకటించారని, ప్రస్తుతం ఆయనతోనే వారంతా చెట్టాపట్టాల్‌ వేసుకున్నారన్నారు. బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర చెక్‌లో లంచం తీసుకున్నారని, నా గురించి మాట్లాడతారన్నారు. విజయేంద్ర ఎలా సంపాదించింది బీజేపీకే చెందిన యత్నాళ్‌, రమేశ్‌ జార్కిహొళిలు వివరించారన్నారు.


15సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టా...

శిగ్గావి శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగిభావి రిసార్ట్‌లో కురుబ సామాజికవర్గ ముఖ్యులతో ప్రత్యేక సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 15సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టానని ఇకపై సాధ్యమో కాదో తెలియదన్నారు. కాగినెలె స్వామీజీకి ప్రచారానికి రావద్దని కోరానన్నారు. ఒకవేళ స్వామీజీ వస్తే మీరంతా కాంగ్రెస్‏కు మద్దతు ఇవ్వాలన్నారు. తనపై ఎటువంటి ఆరోపణలు లేవని, అయినా అవమానాలు భరిస్తున్నానన్నారు. తనపై కుట్ర చేసినవారిలో బసవరాజ్‌ బొమ్మై, యడియూరప్ప, దేవెగౌడ కుమారులు, అశోక్‌ వంటివారంతా కలిశారన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై అవినీతి కుట్ర పన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈవార్తను కూడా చదవండి: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా

ఈవార్తను కూడా చదవండి: Medical Student: అయ్యా.. నాది ఏ రాష్ట్రం?

ఈవార్తను కూడా చదవండి: Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 06 , 2024 | 01:38 PM