Chief Minister: తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారు..

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:19 PM

తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారని, నేను 40ఏళ్ల క్రితమే మంత్రిని అయ్యానని, 14 ఇంటి స్థలాలకోసం ఎందుకు తప్పు చేస్తానని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ప్రశ్నించారు. టి నరసీపురలో బుధవారం రూ.470 కోట్లతో అభివృద్ధి పనులు, సంక్షేమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.

Chief Minister: తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారు..

- టి.నరసీపురలో రూ.470 కోట్ల పనులకు భూమిపూజ

బెంగళూరు: తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారని, నేను 40ఏళ్ల క్రితమే మంత్రిని అయ్యానని, 14 ఇంటి స్థలాలకోసం ఎందుకు తప్పు చేస్తానని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ప్రశ్నించారు. టి నరసీపురలో బుధవారం రూ.470 కోట్లతో అభివృద్ధి పనులు, సంక్షేమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీలను దుర్వినియోగం చేస్తోందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులు వర్ష సూచన


ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టారని ప్రస్తుతం నన్ను, నా భార్యను టార్గెట్‌ చేశారన్నారు. బీజేపీ(BJP) రాష్ట్రంలో ఇప్పటివరకు సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ఆపరేషన్‌ కమల ద్వారా మాత్రమే అధికారంలోకి వచ్చిందని, ఈసారి 50 మంది ఎమ్మెల్యేలకు తలా రూ.50కోట్లు ఆఫర్‌ ఇచ్చారని ఆరోపించారు. యడియూరప్ప, బొమ్మై, అశోక్‌(Yediyurappa, Bommai, Ashok)లకు ఇంత సొమ్ము ఎక్కడనుంచి వచ్చిందని, వారేమైనా ప్రింట్‌ వేశారా..? అంటూ ప్రశ్నించారు.


pandu1.2.jpg

రాష్ట్రంలో ఐదు గ్యారెంటీల అమలుపై బీజేపీ, జేడీఎస్‌(BJP, JDS) నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1.20 లక్షల కోట్లు అభివృద్ధికి కేటాయించిందన్నారు. టి నరసీపుర రూపురేఖలు మారనున్నాయన్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మహదేవప్పతోపాటు మంత్రులు వెంకటేశ్‌, ఎంసీ సుధాకర్‌, ఎంపీ సునిల్‌బోస్‌, గ్యారెంటీ అమలు కమిటీ వైస్‌ చైర్మన్‌ పుష్ప అమరనాథ్‌, ఎమ్మెల్సీలు యతీంద్ర సిద్దరామయ్య, డాక్టర్‌ తిమ్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: కొడంగల్‌ నుంచే రేవంత్‌ భరతం పడతాం

ఈవార్తను కూడా చదవండి: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం

ఈవార్తను కూడా చదవండి: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2024 | 12:19 PM