ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IAF: ఎల్ఏసీ వెంబడి చైనా వేగంగా నిర్మాణాలు.. ఎయిర్ చీఫ్ వెల్లడి

ABN, Publish Date - Oct 04 , 2024 | 05:17 PM

ప్రపంచంలోని వివిధ చోట్ల నెలకొంటున్న ఉద్రిక్తతలు, యుద్ధాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశీయ ఆయుధ తయారీ వ్యవస్థలు ఉండటం చాలా ముఖ్యమని వాయిసేన చీఫ్, ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు.

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ (Line of Actua Control) వెంబడి, ముఖ్యంగా లద్దాఖ్ సెక్టార్‌లో చైనా (China) వేగంగా మౌలిక వసతులు, నిర్మాణాలు చేపడుతోందని వాయిసేన చీఫ్, ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ (Amar Preet Singh) శుక్రవారంనాడు తెలిపారు. ఇండియా సైతం అదే స్థాయిలో సరిహద్దుల వెంబడి సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు చెప్పారు. 'ఎయిర్ ఫోర్స్ డే' రానున్న నేపథ్యంలో శుక్రవరంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని వివిధ చోట్ల నెలకొంటున్న ఉద్రిక్తతలు, యుద్ధాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశీయ ఆయుధ తయారీ వ్యవస్థలు ఉండటం చాలా ముఖ్యమని అన్నారు. 2047 నాటికి భారత దళాల వద్ద పూర్తిగా స్వదేశీ ఆయుధాలే ఉండాలన్నారు.

NCP MLA Jumped Matralaya: సచివాలయం మూడో అంతస్తు నుంచి దూకిన ఎమ్మెల్యే


మూడు యూనిట్ల ఎస్-400 మిజైల్ సిస్టమ్స్‌ను రష్యా నుంచి దిగుమతి అయ్యాయని, తక్కిన రెండు యూనిట్లను వచ్చే ఏడాది అందజేస్తామని ఆ దేశం వాగ్దానం చేసిందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఏపీ సింగ్ తెలిపారు. ఇండియా వద్ద 83 లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ (LCAs) ఉన్నారు. త్వరలోనే 97 మార్క్ 1, మార్క్ 2 ఎయిర్‌క్రాఫ్ట్‌ సేకరించనున్నామని చెప్పారు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే వెళ్లే మీడియం-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిజైల్స్ (ఎంఆర్ఎస్ఏఎం), ఆకాష్ మిసైల్ సిస్టమ్ ‌ను ప్రవేశపెట్టే ప్రక్రియ జరుగుతోందన్నారు.


భారత్ అనవసరంగా దాడులకు వెళ్లదని, మనల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేసినప్పుడే దానికి దీటుగా స్పందించాల్సి వస్తుందని పరోక్షంగా చైనాను ఉద్దేశించి అన్నారు. అందుకు సంబంధించిన తమ ప్లాన్స్ తమకు ఉంటాయని చెప్పారు. వారికంటే మనం మంచి శిక్షణ ఇవ్వగలుగుతున్నామని కచ్చితంగా చెప్పగలనని అన్నారు. టెక్నాలజీ పరంగా ప్రస్తుతానికి కొంత వెనకబడినప్పటికీ దానిని అధిగమిస్తామన్నారు. ప్రొడక్షన్ రేట్లకు సంబంధించి కొంత వెనకబడినా పురోగమిస్తామన్నారు. వీటికి సమయం పడుతుందని, రాత్రికి రాత్రే అన్నీ పూర్తికావని చెప్పారు.


For Latest news and National news click here

ఇది కూడా చదవండి...

Minister: ‘ముడా’ వివాదంపై పెదవి విప్పిన మంత్రి.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Updated Date - Oct 04 , 2024 | 05:17 PM